Split ACs Offers
Split ACs Offers : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? ఈ వేసవిలో తక్కువ ధరలో ఏసీ కొనేసుకోవచ్చు. మీరు రూ. 25వేల లోపు స్ప్లిట్ ఏసీ కొనాలని చూస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం, ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వివిధ బ్రాండ్ల నుంచి ఎయిర్ కండిషనర్లను ఆకర్షణీయమైన ధరలకు అందిస్తున్నాయి.
50 శాతం వరకు తగ్గింపుతో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోవచ్చు. అదనంగా, మీ ఏసీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్స్ సమయంలో మీరు బడ్జెట్-ఫ్రెండ్లీ స్ప్లిట్ ఏసీని కొనుగోలు చేయాలంటే కొన్ని అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
డైకిన్ స్ప్లిట్ ఏసీ :
అమెజాన్‌లో డైకిన్ నుంచి స్ప్లిట్ ఏసీ కేవలం రూ.26,490కి లభిస్తుంది. రూ.3వేల బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఈ ఏసీ ధర రూ.23,490కి తగ్గుతుంది. ప్రీమియం యూనిట్లలో ఈ బ్రాండ్ పాపులర్ కాగా, స్ప్లిట్ ఏసీ 0.8 టన్నుల కెపాసిటీని కలిగి ఉంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ కాపర్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. 2.5 PM ఫిల్టర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఒక ఏడాది వారంటీతో పాటు కంప్రెసర్‌పై 5 ఏళ్ల వారంటీతో వస్తుంది.
మార్క్యూ స్ప్లిట్ ఏసీ :
ఫ్లిప్‌కార్ట్‌లో, మార్క్యూ స్ప్లిట్ ఏసీ ధర కేవలం రూ. 23,990 మాత్రమే. మీ కొనుగోలుపై 5 శాతం వరకు అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్ టర్బో కూల్ టెక్నాలజీతో పాటు 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఒక టన్ సామర్థ్యంతో పవర్ కెపాసిటీ కోసం 5-ఇన్-1 ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉంది.
క్రూయిజ్ ఏసీ :
మీరు అమెజాన్‌లో క్రూయిజ్ నుంచి 1-టన్ స్ప్లిట్ ఏసీని కొనేసుకోవచ్చు. ఈ ఏసీ ధర రూ.26,490. ఈ మోడల్‌పై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 7-దశల ఎయిర్ ఫిల్ట్రేషన్‌తో వస్తుంది. 4-ఇన్-1 కన్వర్టిబుల్ సిస్టమ్, పీఎం 2.5 ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీని అందించి మీ ఇంటి గదిని ఎప్పుడూ కూలింగ్‌గా ఉంచుతుంది.