ATM New Rules : మే 1 నుంచి ఏటీఎం కొత్త రూల్స్.. ఇకపై డబ్బులు తీసినా.. బ్యాలెన్స్ చెక్ చేసినా ఛార్జీలు చెల్లించాల్సిందే!

ATM New Rules : ఏటీఎం కొత్త రూల్స్ రానున్నాయి. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినా లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా ఇంటర్‌చేంజ్ ఫీజులు చెల్లించాల్సిందే..

ATM New Rules : మే 1 నుంచి ఏటీఎం కొత్త రూల్స్.. ఇకపై డబ్బులు తీసినా.. బ్యాలెన్స్ చెక్ చేసినా ఛార్జీలు చెల్లించాల్సిందే!

ATM New Rules

Updated On : April 22, 2025 / 5:00 PM IST

ATM New Rules : ఏటీఎం వాడుతున్నారా? మీ బ్యాంకు ఏదైనా సరే.. మే 1 నుంచి ఛార్జీల మోతే.. ఈ తేదీ నుంచే ఏటీఎం కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు విత్ డ్రా కోసం ఏటీఎం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, వారి మీకోసమే.. వచ్చే నెల నుంచి ఏటీఎం రూల్స్ మారబోతున్నాయి.

అంటే.. కొత్త ఏటీఎం ఛార్జీలు విధించనున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రతిపాదనను ఆర్బీఐ ఆమోదించిన తర్వాత ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేవారికి అదనపు ఛార్జీలు విధించనున్నారు.

Read Also : Hero Vida V2 Scooter : కిర్రాక్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 165 కి.మీ దూసుకెళ్తుంది!

మే 1, 2025 నుంచి మరో బ్యాంకు ATM నుంచి స్టేబుల్ లిమిట్ తర్వాత డబ్బును విత్‌డ్రా చేయడానికి (గతంలో రూ. 17 ఉండేది) ఇప్పుడు రూ. 19 అవుతుంది. అలాగే, బ్యాలెన్స్ చెక్ చేసేందుకు ఛార్జీని కూడా రూ. 7 నుంచి రూ. 9 కి పెంచారు. బ్యాంక్ కస్టమర్లకు మెట్రో నగరాల్లో 5 ఫ్రీ లావాదేవీలు, ఇతర మెట్రోయేతర నగరాల్లో 3 ఫ్రీ లావాదేవీల పరిమితిని ఇతర ఏటీఎంలలో ఒక నెలకు ఈ పెరిగిన ఛార్జీలు విధిస్తాయి.

పెరగనున్న ఏటీఎం ఛార్జీలు :
ఏటీఎం నెట్‌వర్క్ ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం కంపెనీలు ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాలనే డిమాండ్ కారణంగా ఏటీఎం ఛార్జీలను పెంచాయి. నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులు గతంలో కన్నా పెరిగాయి.

ఇలాంటి పరిస్థితిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ డిమాండ్‌ను రిజర్వ్ బ్యాంక్ ముందు ఉంచింది. దాంతో ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏటీఎం ఛార్జీల పెరుగుదల ఇప్పుడు ఏటీఎం నెట్‌వర్క్ కోసం ఆధారపడే బ్యాంకులపై అధిక ప్రభావం పడుతుంది.

నాన్-హోమ్ బ్యాంక్ MTA నుంచి డబ్బును విత్‌డ్రా లేదా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు యూజర్లు ఇప్పుడు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ఛార్జీల తర్వాత ఏటీఎం ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు అదనపు ఛార్జీలు పడకుండా ఉండేందుకు తమ హోమ్ బ్రాంచ్ ఏటీఎంని ఉపయోగించాలి లేదా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

Read Also : Free JioHotstar : జియో అదిరే ఆఫర్.. ఫ్రీ జియో హాట్‌స్టార్ ఆఫర్ మళ్లీ పొడిగింపు.. ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ చూడొచ్చు..!

SBI ఇప్పటికే ఏటీఎం లావాదేవీలు, కస్టమర్లకు ఛార్జీలలో మార్పులు చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి వర్తిస్తుంది. కానీ, ఆర్బీఐ సూచనల ప్రకారం.. మే 1, 2025 నుంచి విత్‌డ్రాకు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి తప్పదు.