Apple MacBook Neo Price : ఇది కదా డిస్కౌంట్.. రూ.79,900 మ్యాక్‌బుక్ నియో ఇప్పుడు రూ.64,890కే.. ఈ ఆఫర్ మిస్ కావొద్దు!
Apple MacBook Neo Price : ఆపిల్ మ్యాక్‌బుక్ నియోపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో రూ.79,900 ల్యాప్‌టాప్‌ను రూ.64,890కే ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం.. ఫీచర్లు, ఈఎంఐ వివరాలివే..
- Sreehari A
- Published on- November 12, 2026 / 09:11 PM IST
MacBook Neo Amazon Deal,
- ఆపిల్ మ్యాక్‌బుక్ కొనాలనుకుంటున్నారా?
- బ్యాంక్ కార్డులతో మరింత తక్కువ ధరకే
- రూ.15,010 వరకు ఆదా చేసుకోవచ్చు
Apple MacBook Neo Price : కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఆపిల్ మ్యాక్‌బుక్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. లేటెస్టుగా ఆపిల్ మ్యాక్‌బుక్ నియోపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల ధర పెరిగిన ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు ప్రత్యేక ఆఫర్లతో రూ.65 వేలలోపే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. విజయ్ సేల్స్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మ్యాక్‌బుక్ నియోపై అదిరిపోయే ఆఫర్ :
మ్యాక్‌బుక్ నియో ఇటీవల ధర పెరిగి రూ.79,900కు చేరింది. అయితే, ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ రూ.71,890కే లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ.8,010 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సస్ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరో రూ.7వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : WhatsApp Chats : బాబోయ్.. వాట్సాప్‌లో మన చాట్స్ నిజంగా సీక్రెట్టేనా? Google AI చెప్పిన షాకింగ్ నిజాలు!
ఈ రెండు ఆఫర్లను కలిపి చూస్తే.. మ్యాక్ బుక్ నియో నికర ధర రూ.64,890కు చేరుతుంది. అంటే మొత్తం మీద రూ.15,010 వరకు ఆదా చేసుకోవచ్చన్నమాట. అంతేకాదు, 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. నెలకు రూ.10,815 నుంచి ఈఎంఐతో పాటు బ్యాంక్ ఆఫర్లు నిబంధనలు వర్తిస్తాయి.
మ్యాక్‌బుక్ నియో ఫీచర్లు ఇవే :
ఈ ల్యాప్‌టాప్‌లో 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఆపిల్ ఎ18 ప్రో చిప్‌సెట్‌తో పనిచేసే ఇందులో 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి.
8GB యూనిఫైడ్ మెమరీ, 512GB వరకు SSD స్టోరేజ్ ఆప్షన్, 1080p ఫేస్ టైమ్ హెచ్‌డీ కెమెరా అద్భుతంగా ఉంటుంది. (macOS Tahoe) ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 36.5Wh బ్యాటరీ, 20W USB-C ఛార్జర్ కూడా ఉన్నాయి. హయ్యర్ వేరియంట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లభిస్తుంది.
ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉండొచ్చు. అయితే, ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు బ్యాంక్ ఆఫర్లు, వేరియంట్, ఫైనల్ ధరను తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
