GIFI: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బీమా పరిశ్రమలో మొట్టమొదటిసారి జనరల్ ఇన్సూరెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (GIFI)ని నిర్వహిస్తోంది. ఒక్క రోజు నిర్వహించనున్న ఈ వేడుకలో ప్రఖ్యాత వక్తల ప్రేరణాత్మక సందేశాలు, లైఫ్‌స్టైల్ జోన్, ప్రఖ్యాత సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ పెర్ఫామెన్స్, హాస్యనటుడు సునీల్ గ్రోవర్ వినోద విభావరి సహ మరెన్నో సరదా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వేడుకలో భాగంగా “GIFI అవార్డ్స్” వేడుక ఉంటుంది. ఈ GIFI అవార్డు కోసం పరిశ్రమవ్యాప్తంగా ఉన్న హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు తమ పేర్లు నామినేట్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ జూలై 3, 2023న పూణేలో జరుగుతుంది.
H1- B Visa: హెచ్-1 బీ వీసాలపై బైడెన్ సర్కార్ నిర్ణయం ప్రకటించే అవకాశం
భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన సాధారణ బీమా ఏజెంట్లను గుర్తించేందుకు, సాధారణ బీమా పరిశ్రమ పట్ల వారి కృషి, అభిరుచిని గౌరవించేందుకు భారతదేశంలో GIFI అవార్డ్స్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ప్రకాష్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఆలిస్ జి. వైద్యన్, ఐఆర్‌డిఎఐ మాజీ సభ్యుడు శ్రీ నీలేష్ సాఠే వ్యవహరిస్తారు.