Bajaj Dominar 400 : కొంటే ఇలాంటి బైకు కొనాలి.. బజాజ్ డొమినార్ 400 కొత్త అవతార్ అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
Bajaj Dominar 400 : బజాజ్ ఆటో టూరింగ్ డొమినార్ 400 కొత్త బైక్ వచ్చేసింది. '400' పేరుతో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇందులో కొత్త 350cc ఇంజన్‌ను అమర్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published on- April 14, 2026 / 04:00 PM IST
Bajaj Dominar 400
- బజాజ్ డొమినార్ 400 కొత్త బైక్ చూశారా?
- రూ. 37వేలు అదనపు ధరతో మార్కెట్లో లాంచ్
- 350CC ఇంజిన్ సామర్థ్యం, ధర రూ. 37వేలు తగ్గింపు
Bajaj Dominar 400 : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. బజాజ్ ఆటో పాపులర్ టూరింగ్ బైక్ డోమినార్ 400ను కొత్త అవతార్‌లో లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ బజాజ్ డొమినార్ సంచలనం సృష్టిస్తోంది. ఈ బైకులో స్పెషాలిటీ ఏంటంటే.. కొత్త 350cc ఇంజన్‌ను అమర్చారు. గతంతో పోలిస్తే ఈ బైక్ ధర ఇప్పుడు సుమారు రూ. 37వేలు తగ్గింది. ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధరను రూ. 2,03,214గా నిర్ణయించారు.
వాస్తవానికి, ఇంజన్ సామర్థ్యం 350cc కన్నా తక్కువగా ఉండటంతో ఇప్పుడు 40శాతానికి బదులుగా కేవలం 18శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తున్నారు. బజాజ్ ఈ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందిస్తోంది. బజాజ్ డోమినార్ బైక్ ఫీచర్లు, ధర ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి.
పవర్‌ట్రెయిన్ ఎలా ఉందంటే? :
పాత డొమినార్ 373cc ఇంజన్‌తో వచ్చింది. ఈ బైకు స్థానంలో ఇప్పుడు కొత్త 349.13cc ఇంజన్‌ను అమర్చారు. ఆసక్తికరంగా, ఇంజన్ సైజు చిన్నదైనా పవర్ కొద్దిగా పెరిగింది. ఇప్పుడు 40.4bhp పవర్ జనరేట్ చేస్తుంది. పాత మోడల్ కన్నా సుమారు 1bhp ఎక్కువ.
అయితే, టార్క్ 2.8Nm మేర కొద్దిగా తగ్గింది. ఇప్పుడు 33.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు స్పీడ్, పర్ఫార్మెన్స్ కోసం కంపెనీ ఇంజన్ స్ట్రోక్‌ను కూడా కొద్దిగా తగ్గించింది.
ఈ బైక్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. సైజు, డిజైన్ మారలేదు. 193 కేజీల కర్బ్ వెయిట్ 13-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో లాంగ్ రైడ్లకు అద్భుతంగా ఉంటుంది. బజాజ్ ఫీచర్ల విషయంలో కూడా పెద్దగా రాజీ పడలేదు. ఇందులో అద్భుతమైన ఫుల్-LED హెడ్‌ల్యాంప్, డ్యూయల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్లిప్పర్ క్లచ్, బ్యాలెన్స్ కోసం USD ఫ్రంట్ ఫోర్క్‌లు ఉన్నాయి.
డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్లు :
సేఫ్టీ కోసం ఫ్రంట్, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. హై స్పీడ్‌తో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు బైక్ జారిపోకుండా అడ్డుకుంటుంది. సౌకర్యవంతమైన లాంగ్ రైడ్ కోసం ఇందులో నిటారుగా కూర్చునే యాంగిల్, స్ప్లిట్ సీట్లు, విండ్‌స్క్రీన్, శాడిల్ స్టేస్ వంటి యాక్సెసరీలు ఉన్నాయి.
