Bank Account Rules ( Image Credit : Google Gemeni AI )
Bank Account Rules : మీకు బ్యాంకు అకౌంట్ ఉందా? ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికి బ్యాంకు అకౌంట్ అనేది సర్వసాధారణం. అది శాలరీ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇలా చాలానే ఉంటాయి. జీతం దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం, ఈఎంఐ తగ్గడం లేదా ఆన్ లైన్ పేమెంట్లు చేయడం వంటివి అన్నింటికి ప్రతిదీ బ్యాంకు అకౌంటుకు లింక్ అయి ఉంటుంది.
ఒకవేళ మీ బ్యాంకు అకౌంట్ ఏదైనా అనివార్య కారణాల వల్ల అకస్మాత్తుగా స్తంభించిపోతే మీరు ఖాతాలో డబ్బులు తీయడం కుదరదు.. అలాగే వేయడం కూడా కుదరదు.. బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అయితే ఏం చేయాలి? తిరిగి యాక్టివ్ అయ్యేందుకు బ్యాంకు అకౌంట్స్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
డబ్బులు తీయలేరు, వేయలేరు :
బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అయితే మీరు డబ్బును విత్ డ్రా చేయలేరు. ట్రాన్సాక్షన్లు కూడా చేయలేరు. అందుకే మీ బ్యాంకు అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయింది? ఎలా తిరిగి యాక్టివ్ చేయవచ్చు అనేది తెలిసి ఉండాలి. అకౌంట్ ఒకసారి స్తంభిస్తే అకౌంట్ నుంచి అన్ని లావాదేవీలు తాత్కాలికంగా నిలిచిపోతాయి.
కేవైసీ అప్‌డేట్‌లు అప్‌డేట్ చేయకపోతే కూడా బ్యాంకులు తరచుగా అకౌంట్ క్లోజ్ చేస్తుంటాయి. కొన్నిసార్లు, ఎక్కువ కాలం లావాదేవీలు జరగకపోతే అకౌంట్ ఆటోమాటిక్‌గా ఇన్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా అనుమానాస్పద లావాదేవీలతో కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. భారత్‌లో బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసేందుకు చట్టబద్ధంగా అధికారం ఉంది.
అధికారిక ఆదేశాలతో కూడా అకౌంట్ ఫ్రీజ్ :
భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం కూడా చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు.. అవసరమైతే ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా అకౌంట్ ఫ్రీజ్ చేయమని ఆదేశించవచ్చు.
కొన్నిసార్లు, ఊహించని విధంగా పెద్ద మొత్తంలో లావాదేవీలు విదేశాలలో డెబిట్ కార్డ్ కొనుగోలు లేదా మల్టీ ఆన్‌లైన్ పేమెంట్లు వంటి చేస్తే ఆటో సిస్టమ్ వెంటనే అలర్ట్స్ అవుతాయి. అలాంటి సందర్భాలలో కస్టమర్ సేఫ్టీ కోసం అకౌంట్ తాత్కాలికంగా ఫ్రీజ్ అవుతుంది.
ప్రతి 3 ఏళ్లకు ఒకసారి KYC అప్‌డేట్ తప్పనిసరి. ఈ ప్రాసెస్ పూర్తి చేయని బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అదేవిధంగా, 6 నెలల పాటు లావాదేవీలు జరగకపోతే ఆ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ లేదా కోర్టు ఆదేశం జారీ చేస్తే కూడా బ్యాంకు స్వయంగా ఏం చేయలేదు. సంబంధిత విభాగం నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే అకౌంట్ తిరిగి యాక్టివ్ అవుతుంది.
ఈ కారణాలతో మీ బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అయితే ముందుగా మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి. ఆపై అకౌంట్ ఫ్రీజ్ అవ్వడానికి కారణాన్ని తెలుసుకోండి. ఆ కారణం కేవైసీ సమస్య లేదా అనుమానాస్పద లావాదేవీ అయితే మాత్రం అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి మీ అకౌంట్ తిరిగి పొందవచ్చు.