Bank Holidays August 2026 : ఆగస్టులో బ్యాంకు పని ఉందా? 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఈ తేదీల్లో వెళ్లొద్దు.. ఫుల్ లిస్ట్!

Bank Holidays August 2026 : ఆగస్టు నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకు సెలవులను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకుకు వెళ్లే ముందు మీ నగరంలోని బ్యాంకు సెలవులు ఎప్పుడు అనేది ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. పుల్ లిస్టు ఓసారి చెక్ చేయండి.

Bank Holidays August 2026 ( Image credit : AI )

  • వచ్చే ఆగస్టులో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే?
  • ఆగస్టు బ్యాంకు సెలవుల జాబితాను ప్రకటించిన ఆర్బీఐ
  • మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు

Bank Holidays August 2026 : బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టులో మీకు బ్యాంకులో పని ఉందా? అయితే, ఇది మీకోసమే.. జూలై నెల ముగుస్తోంది. ఆగస్టు కొత్త నెల ప్రారంభం కానుంది. వచ్చే ఆగస్టులో బ్యాంకులకు పూర్తిగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం.. అధికారిక, పండగ సెలవులతో కలిపి మొత్తంగా బ్యాంకులకు సంబంధించి వేర్వేరు నగరాలకు సెలవులను ప్రకటించింది.

మీరు వచ్చే నెలలో బ్యాంకుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే ముందుగా మీ నగరంలోని ఆర్‌బీఐ బ్యాంకు సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆ తర్వాతే బ్యాంకుకు వెళ్లడం బెటర్. ఆగస్టులో రాబోయే బ్యాంకుల సెలవుల పూర్తి జాబితాను ఓసారి లుక్కేయండి..

ఆగస్టు బ్యాంకుల సెలవుల లిస్టు ఇదే :
ఆర్‌బీఐ బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం.. 2026 ఆగస్టులో దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఇందులో ఆదివారాలు, రెండో శనివారాలు, నాల్గో శనివారాలు కూడా ఉన్నాయి.

ఆగస్టు 2 : ఆదివారం
ఆగస్టు 8 : రెండవ శనివారం
ఆగస్టు 9 : ఆదివారం
ఆగస్టు 16 : ఆదివారం
ఆగస్టు 22 : నాల్గవ శనివారం
ఆగస్టు 23 : ఆదివారం
ఆగస్టు 30 : ఆదివారం

ఏయే తేదీల్లో బ్యాంకులకు పండగ సెలవులంటే :

ఆగస్టు 4 : కేర్ పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులు పనిచేయవు.

ఆగస్టు 8 : టెండోంగ్ లో రమ్ ఫాట్ రోజున గాంగ్‌టక్‌లో బ్యాంకులు మూతపడతాయి.

ఆగస్టు 13 : పేట్రియాట్స్ డే సందర్బంగా ఇంఫాల్‌లో బ్యాంకులు పనిచేయవు.

ఆగస్టు 15 : స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే

ఆగస్టు 19 : మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు పనిచేయవు.

ఆగస్టు 25 : ఓనం మిలాద్-ఉన్-నబీ కారణంగా కొచ్చి, తిరువనంతపురం విజయవాడలో బ్యాంకులకు సెలవు.

ఆగస్టు 26 : ఈద్-ఎ-మిలాద్, బరఫాతా, మిలాద్-ఉన్-నబీ తిరువోనం కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ తిరువనంతపురంతో సహా పలు నగరాల్లో ఈ రోజున బ్యాంకు శాఖలు మూతపడతాయి.

ఆగస్టు 28 : రక్షా బంధన్, పాంగ్-ల్హాబ్సోల్, శ్రీ నారాయణ గురు జయంతి, అయ్యన్‌కాళి జయంతి కారణంగా అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, సిమ్లా, శ్రీనగర్ తిరువనంతపురంలో ఈ రోజున బ్యాంకులు పనిచేయవు.