Bank of Baroda FD Rates : FD చేసేవారికి గుడ్ న్యూస్.. 555 రోజుల స్కీమ్‌పై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు.. కొత్త FD రేట్లు ఇవే!

Bank of Baroda FD Rates : బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచింది. 555 రోజుల స్పెషల్ స్కీమ్‌లో సాధారణ, సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఎంత వడ్డీ లభిస్తుంది? కొత్త రేట్లు, పూర్తి వివరాలేంటో చూద్దాం..

Bank of Baroda FD Rates

  • 555 రోజుల స్కీమ్‌పై వడ్డీ పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా
  • BoB కొత్త వడ్డీ రేట్లతో సీనియర్ సిటిజన్లకు మరింత లాభం
  • ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అదనపు ఆదాయం..

Bank of Baroda FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బులు పెట్టాలని చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 555 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకంలో వడ్డీ రేటును పెంచడంతో పెట్టుబడిదారులకు మరింత ఆదాయం పెరగనుంది.. పూర్తి వివరాలివే..

సురక్షితమైన పెట్టుబడితో పాటు స్థిరమైన రాబడి కోరుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. బ్యాంకు సవరించిన కొత్త వడ్డీ రేట్లు 2026 నవంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చాయి. రూ.3 కోట్ల లోపు రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి..

555 రోజుల FDలో ఎంత వడ్డీ వస్తుంది? :
బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న ‘బాబ్ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’లో వడ్డీ రేటును 0.10 శాతం పెంచింది. దీంతో సాధారణ ఖాతాదారులకు గతంలో 6.75 శాతంగా ఉన్న వడ్డీ ఇప్పుడు 6.85 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం నుంచి 7.35 శాతానికి పెరిగింది.

Read Also : HMD 2320 Flip 4G : పాత రోజులు మళ్లీ వచ్చేస్తున్నాయా? HMD నుంచి కొత్త 4G ఫ్లిప్ ఫోన్.. ఫీచర్లు కేక..

ఇక 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.45 శాతం వడ్డీ లభించనుంది. మరోవైపు 444 రోజుల ‘బాబ్ స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్ స్కీమ్’ వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సాధారణ కస్టమర్లకు 6.45 శాతం, సీనియర్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్లకు 7.05 శాతం వడ్డీ కొనసాగుతుంది.

సీనియర్లకు అదనపు బెనిఫిట్స్ :
బ్యాంకు నిబంధనల ప్రకారం.. 60 ఏళ్లు దాటిన వారికి డిపాజిట్ టెన్యూర్ బట్టి అదనపు వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల వరకు 0.50 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 0.60 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 1 శాతం వరకు అదనపు బెనిఫిట్ లభిస్తుంది.

80 ఏళ్లు పైబడిన వారికి ఎఫ్‌డీ డిపాజిట్లపై మరో 0.10 శాతం అదనపు వడ్డీ అందుతుంది. అయితే, ఈ కొత్త రేట్లు కొత్తగా చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లు, రెన్యువల్ చేసే డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ లెక్కింపు విధానం, మెచ్యూరిటీ మొత్తం, అడ్వాన్స్ విత్ డ్రా వంటి నిబంధనలను తెలుసుకోవడం బెటర్..