Bank of India : బ్యాంకు ఆఫ్ ఇండియాలో పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు.. ఈరోజు నుంచే అమల్లోకి..!

Bank of India : బ్యాంకు ఆఫ్ ఇండియాలో (BOI)లో 46 రోజుల నుంచి ఒక ఏడాది వరకు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను పెంచగా.. డిసెంబర్ 1 (శుక్రవారం) నుంచి అమలులోకి వచ్చాయి.

Bank of India Increases Fixed Deposit Rates for Various Tenor

BOI Fixed Deposit Rates : భారత్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. 46 రోజుల నుంచి ఒక ఏడాది వరకు మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది.

Read Also : Aadhaar Fraud Warning : మీ ఆధార్ విషయంలో ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదంటే? ఈ 10 విషయాలను తప్పక తెలుసుకోండి..!

కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) రేట్లను రూ. 2 కోట్లు అంతకంటే ఎక్కువ లేదా రూ.10 కోట్ల కన్నా తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. మొత్తంగా 46 రోజుల నుంచి ఒక ఏడాది వరకు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేట్లు డిసెంబర్ 1 శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయి.

ఈ వడ్డీ రేట్లు ఎవరెవరికి వర్తిస్తాయంటే? :
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తక్కువ వ్యవధిలో 46 రోజుల నుంచి 90 రోజుల కాలవ్యవధికి 5.25శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల కాలవ్యవధికి 6.00శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల కాలవ్యవధికి 6.25శాతం, 211 రోజుల నుంచి ఒక ఏడాది కన్నా తక్కువ కాల వ్యవధికి 6.50శాతం, ఒక ఏడాది కాలవ్యవధిలో 7.25శాతానికి పెంచింది. ఈ వడ్డీ రేట్లు హెచ్‌ఎన్ఐలు, చిన్న, మధ్యతరహా కార్పొరేట్‌లు, ఎన్ఆర్ఐలతో పాటు వృత్తిపరంగా స్వయం ఉపాధి పొందిన వారికి అందుబాటులో ఉంటాయి.

Bank of India Increases Fixed Deposit Rates for Various Tenor

ఇప్పటికే, బ్యాంక్ (నవంబర్ 1, 2023)లో 2 ఏళ్ల కాలవ్యవధికి రూ. 2 కోట్ల కన్నా తక్కువ మొత్తానికి అన్ని డిపాజిట్ల రేటును పెంచింది. బ్యాంక్ తన అత్యధిక వడ్డీ రేటును సూపర్ సీనియర్ సిటిజన్‌కు 7.90శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75శాతం, ఇతరులకు 7.25శాతం వరకు 2ఏళ్ల కాలవ్యవధికి అందిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది.

Read Also : ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూపే క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు