ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూపే క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. యూపీఐకి లింక్ చేసుకోవడం ద్వారా ఈజీగా ఆన్‌లైన్‌ సహా అన్నిరకాల లావాదేవీలను పూర్తి చేయొచ్చు.

ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూపే క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

ICICI Bank introduces UPI payments via RuPay Credit Cards

ICICI Bank UPI Payments : ప్రముఖ దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం యూపీఐ పేమెంట్లను మరింత సులభతరం చేస్తోంది. యూపీఐ లావాదేవీలతో రూపే క్రెడిట్ కార్డ్‌లను అనుసంధానించినట్లు ఐసీఐసీఐ ప్రకటించింది.

ఈ ఇంటిగ్రేషన్‌తో, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి యూపీఐకి లింక్ చేసి పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చు. షాపింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, ఆఫ్‌లైన్- POS (పాయింట్‌ అఫ్ సేల్ ) మెషిన్‌ల వద్ద సౌకర్యవంతంగా, సురక్షితమైన పద్ధతిలో లావాదేవీలను నిర్వహించుకోనే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు.. ఈ యూపీఐ లావాదేవీలపై కస్టమర్లు రివార్డ్ పాయింట్‌లను కూడా పొందవచ్చు.

Read Also : UPI Fraud : యూపీఐ పేమెంట్లపై త్వరలో కొత్త రూల్.. రూ. 2వేల కన్నా ఎక్కువ లావాదేవీలు చేస్తే.. 4 గంటలు ఆలస్యం.. ఎందుకో తెలుసా?

ఈ రూపే క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లు :
రూపే క్రెడిట్ కార్డ్‌లపై యూపీఐ లావాదేవీల నిర్వహించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ (HPCL) సూపర్ సేవర్ రూపే క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ రూబిక్స్ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి ఈజీగా లింక్ చేయవచ్చు. అలాగే, (iMobile Pay)తో సహా ఏదైనా యూపీఐ పేమెంట్ యాప్‌ని ఉపయోగించి మర్చంట్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. ఆపై రూపే క్రెడిట్ కార్డ్‌ల నుంచి పేమెంట్లు చేసుకోవచ్చు.

ICICI Bank introduces UPI payments via RuPay Credit Cards

ICICI UPI RuPay Credit Cards

కస్టమర్లకు 50 రోజుల వడ్డీ రహిత క్రెడిట్ :
ఐసీఐసీఐ కార్డ్స్ హెడ్ మిస్టర్ బిజిత్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘మా రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐతో అనుసంధానం కోసం ఎన్‌పీసీఐతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం డిజిటల్ చెల్లింపులపై కస్టమర్లకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి సాయపడుతుంది. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్‌ల అనుసంధానం కస్టమర్‌లకు 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్‌ని అందిస్తుంది. ఈ ఫీచర్ మా కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి చాలా ప్రయోజకరంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

యూపీఐ ఇంటిగ్రేషన్‌తో క్రెడిట్ పేమెంట్లు ఈజీ :
ఈ భాగస్వామ్యంపై ఎన్‌పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ మాట్లాడుతూ.. ‘ఐసీఐసీఐ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌లు ఇప్పుడు యూపీఐలో అందుబాటులోకి వచ్చాయి. రూపే అనేది స్థిరమైన బ్రాండ్‌గా అభివృద్ధి చెందింది. కస్టమర్లకు అవసరాలకు తగినట్టుగా అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. వినియోగదారుల భద్రత మరింత భరోసాను ఇస్తుంది. ఈ ఇంటిగ్రేషన్‌తో కస్టమర్లు డిజిటల్ చెల్లింపులను సౌకర్యవంతంగా చేసుకోగలరు. ఐసీఐసీఐ బ్యాంక్‌తో మా భాగస్వామ్యం రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు మెరుగైన డిజిటల్ పేమెంట్లను చేసుకునేలా అవకాశాన్ని కల్పించడమే లక్ష్యం’ అని ఆమె అన్నారు.

Read Also : Aadhaar Fraud Warning : మీ ఆధార్ విషయంలో ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదంటే? ఈ 10 విషయాలను తప్పక తెలుసుకోండి..!