×
Ad

Bank Savings Scheme : FDపై అద్భుతమైన స్కీమ్.. ఈ బ్యాంకులో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు.. ఎంత వడ్డీ సంపాదించుకోవచ్చంటే?

Bank Savings Scheme : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు FDలపై 3.40 శాతం నుండి 7.35 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.

Bank Savings Scheme

Bank Savings Scheme : బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నారా? ఈ ఏడాది రెపో రేటులో 1.00 శాతం తగ్గింపుతో రుణాలను చౌకగా మారాయి. దాంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పటికీ ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Savings Scheme) తమ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ప్రత్యేకించి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారుల కోసం ప్రత్యేక పథకాన్ని అందిస్తోంది. మీరు కేవలం రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా రూ. 48,841 వరకు స్థిర వడ్డీని పొందవచ్చు.

ఈ బ్యాంకులో FDపై గరిష్టంగా 7.35 శాతం వడ్డీ రేటు :
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 7 రోజులు, గరిష్టంగా 10 ఏళ్ల కాలానికి FD అకౌంట్ తెరవవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు FDలపై 3.40 శాతం నుంచి 7.35 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.

Read Also : WhatsApp Messages Limit : బాబోయ్.. వాట్సాప్ కొత్త రూల్ అంట.. ఇకపై మెసేజ్‌లు అదేపనిగా పంపితే అంతే.. లిమిట్ దాటితే బ్లాక్ చేస్తుంది..!

ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు 3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. యూనియన్ బ్యాంక్ 3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం సాధారణ పౌరులకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు పైబడిన వారికి) 7.35 శాతం వడ్డీని అందిస్తుంది.

రూ.2లక్షల డిపాజిట్‌తో రూ.48,841 వరకు స్థిర వడ్డీ :
మీరు యూనియన్ బ్యాంక్‌లో 3 ఏళ్ల FDలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 43,399 స్థిర వడ్డీతో సహా మొత్తం రూ. 2,43,399 అందుకుంటారు. మీరు సీనియర్ సిటిజన్ అయితే యూనియన్ బ్యాంక్‌లో 3 ఏళ్ల ఫిక్స్‌డ్‌పై రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీరు మెచ్యూరిటీ సమయంలో రూ. 47,015 స్థిర వడ్డీతో సహా మొత్తం రూ. 2,47,015 అందుకుంటారు.

అదేవిధంగా, మీరు సూపర్ సీనియర్ సిటిజన్ అయితే, 3 ఏళ్ల FDలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 48,841 స్థిర వడ్డీతో సహా మొత్తం రూ. 2,48,841 అందుకుంటారు.