×
Ad

Bank Special Scheme : SBI స్పెషల్ స్కీమ్.. జస్ట్ రూ. 2 లక్షలు డిపాజిట్ చాలు.. కేవలం వడ్డీనే రూ. 85,049 సంపాదించుకోవచ్చు.. పూర్తి లెక్కలివే!

Bank Special Scheme : ఎస్బీఐ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఫిక్స్ డ్ ఇంట్రెస్ట్ రూ. 85,049 పొందవచ్చు.. అది ఎలాగంటే?

Bank Special Scheme

  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో స్పెషల్ స్కీమ్
  • ఎస్బీఐలో కనీసం 7 రోజలపాట FD అకౌంట్ ఓపెనింగ్
  • ఐదేళ్ల FDపై ఫిక్స్ డ్ వడ్డీ, మరెన్నో బెనిఫిట్స్

Bank Special Scheme : ఎస్బీఐ కస్టమర్లకు వెరీ గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఎస్బీఐలో కనీసం 7 రోజుల పాటు FD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలను గరిష్టంగా 10 ఏళ్ల పాటు ఓపెన్ చేయొచ్చు.

మీరు రిస్క్ లేని పెట్టుబడి కోసం చూస్తుంటే ఇది మీకోసమే. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) అద్భుతమైన ఆప్షన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో కస్టమర్లకు లాంగ్ టైమ్ ఎఫ్‌డీ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా, కేవలం రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా మీరు మెచ్యూరిటీ తర్వాత రూ. 85,049 వరకు ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ పొందవచ్చు.

అయితే, ఎస్బీఐలో కనీసం 7 రోజుల పాటు ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్ట కాలపరిమితి 10 ఏళ్ల వరకు ఉంటుంది. వివిధ కాలపరిమితులకు బ్యాంక్ 3.05శాతం నుంచి 7.15శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. పెట్టుబడిదారులు తమ అవసరాలు, లక్ష్యాల ఆధారంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.

Read Also : AC Buying Guide : సమ్మర్‌లో కొత్త AC కొనేముందు జాగ్రత్త, ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. 90% మంది ఇదే చేస్తారు!

5 ఏళ్ల FDపై వడ్డీ ఎంతంటే? :
ఎస్బీఐ 5 ఏళ్ల ఎఫ్‌డీ పథకంలో సాధారణ పౌరులకు 6.05శాతం వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడినవారు) 7.05శాతం వరకు వడ్డీ రేట్లు, అనేక మంది సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు) 7.15శాతం వరకు వడ్డీ రేట్లు పొందవచ్చు. బ్యాంక్ 444 రోజుల ‘అమృత వర్ష’ స్పెషల్ ఎఫ్‌డీపై ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోంది. అయితే 5 ఏళ్ల ఎఫ్‌డీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బెస్ట్ ఆప్షన్.

రూ. 2 లక్షల ఎఫ్‌డీపై వడ్డీ ఎంతంటే? :
మీరు సాధారణ పౌరుడు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 ఏళ్ల ఎఫ్‌డీ పథకంలో రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే.. మీరు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 170,035 అందుకుంటారు. ఇందులో రూ. 70,035 ఫిక్స్‌డ్ వడ్డీ ఉంటుంది.

మీరు సీనియర్ సిటిజన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 ఏళ్ల ఎఫ్‌డీ పథకంలో రూ. 283,652 డిపాజిట్ చేస్తే.. మీరు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 283,652 అందుకుంటారు. తద్వారా రూ. 83,652 ఫిక్స్‌డ్ వడ్డీ పొందవచ్చు.

మీరు సూపర్ సీనియర్ సిటిజన్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5 ఏళ్ల ఎఫ్‌డీ పథకంలో రూ. 2లక్షలు డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 285,049 అందుకుంటారు. ఇందులో రూ. 85,049 ఫిక్స్‌డ్ వడ్డీ ఉంటుంది.