Bank Holidays April 2026 : ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..
Bank Holidays April 2026 : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ వివరాలు
- Dharani Pilli
- Published On : March 30, 2026 / 09:12 PM IST
banks will be closed 14 days in 2026 april check list here
Bank Holidays April 2026 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల గురించి అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో బ్యాంకులకు.. వారాంతాలు, జాతీయ పండుగలు, ప్రాంతీయ పండుగలు కలిపి మొత్తంగా 14 రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవుల జాబితా ఒకేలా ఉండదు. కొన్ని పండుగలకు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు వర్తిస్తుంది. ఆ వివరాలు..
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే..
- ఏప్రిల్ 1 – బుధవారం – వార్షిక ఖాతా ముగింపు – దేశవ్యాప్తంగా సెలవు
- ఏప్రిల్ 2 – గురువారం – మాండీ థర్స్ డే – కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో సెలవు
- ఏప్రిల్ 3 – శుక్రవారం – గుడ్ ఫ్రైడే – దాదాపు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో సెలవు
- ఏప్రిల్ 5 – ఆదివారం – వారాంతపు సెలవు – దేశవ్యాప్తంగా హాలీడే
- ఏప్రిల్ 11 – శనివారం – రెండో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
- ఏప్రిల్ 12 – ఆదివారం – వారాంతపు సెలవు – దేశవ్యాప్తంగా సెలవు
- ఏప్రిల్ 13 – సోమవారం – బైసాఖి (ప్రాంతీయ నూతన సంవత్సరం) – కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు
- ఏప్రిల్ 14 – మంగళవారం – డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 15 – బుధవారం – బోహాగ్ బిహు (తమిళ నూతన సంవత్సరం) – కొన్ని రాష్ట్రాలు
- ఏప్రిల్ 19 – ఆదివారం – వారాంతపు సెలవు – దేశవ్యాప్తంగా సెలవు
- ఏప్రిల్ 20 – సోమవారం – బసవ జయంతి – కర్ణాటకలో మాత్రమే సెలవు
- ఏప్రిల్ 25 – శనివారం – నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా సెలవు
- ఏప్రిల్ 26 – ఆదివారం – వారాంతపు సెలవు – దేశవ్యాప్తంగా హాలీడే.
గమనిక:
- బైసాఖి ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో జరుపుకుంటారు.
- బోహాగ్ బిహు అస్సాంలో జరుపుకుంటారు.
- తమిళ నూతన సంవత్సరం తమిళనాడులో జరుపుకుంటారు.
అయితే రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారవచ్చు. ఏప్రిల్ నెలలో మొత్తం 14 రోజుల వరకు బ్యాంకులకు సెలవు ఉంది. కనుక బ్యాంకుకు వెళ్లే పని ఉన్న వారు ఈ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకుని వెళ్తే మంచిదని చెబుతున్నారు.
సెలవుల్లో అందుబాటులో ఉండే సేవలు:
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివేసినా, ఈ సేవలు అందుబాటులో ఉంటాయి:
- నెట్ బ్యాంకింగ్
- మొబైల్ బ్యాంకింగ్ యాప్స్
- ATM సేవలు
- UPI మరియు డిజిటల్ పేమెంట్స్
ఈ సేవలు సాధారణంగా పనిచేస్తూనే ఉంటాయి.
