×
Ad

Bengaluru Techie : జాబ్ పోయింది.. EMIలు ఆగాయి.. కట్ చేస్తే.. రూ.1.2 కోట్ల ఇల్లు బ్యాంక్ లాక్కుంది.. బెంగళూరు టెకీ కన్నీటి గాథ!

Bengaluru Techie : 60 రోజుల్లో జీవితం తలకిందులుగా మారిపోయింది. లక్షల ప్యాకేజీ అందుకునే టెకీ ఈఎంఐలు కట్టలేక ఇష్టపడి కొనుకున్న రూ. కోట్ల ఇల్లు బ్యాంకు స్వాధీనం చేసుకుంది. బెంగళూరు టెకీ షాకింగ్ స్టోరీ..

Bengaluru Techie

  • హోం లోన్ 3 ఈఎంఐలు కట్టలేదని బ్యాంకు కోట్ల ఇల్లు లాగేసుకుంది
  • ఉద్యోగం పోయి నెల జీతం లేక ఈఎంఐలు చెల్లించలేకపోయిన టెకీ
  • లేఆఫ్ దెబ్బకు 60 రోజుల్లోనే కోట్ల ఫ్లాట్ కోల్పోయి నడిరోడ్డుపైకి
  • సీఏ మీనల్ గోయల్ లింక్ డిన్ పోస్టు వైరల్ 

Bengaluru Techie : సొంతిల్లు అందరి కల. కానీ, కొందరు మాత్రమే ఆ కలను నిజం చేసుకుంటారు. అప్పు చేసి ఇల్లు కొనగానే సరిపోదు. ఆ అప్పు కూడా తీర్చినప్పుడే ఆ ఇల్లు పూర్తిగా సొంతం అవుతుంది. చాలామంది కొత్త ఇల్లు కొనేందుకు ఎక్కువగా బ్యాంకు లోన్లపైనే ఆధారపడుతుంటారు. ప్రతి నెలా ఈఎంఐ చెల్లించకతప్పదు. ఒకటి లేదా రెండు ఈఎంఐలు తప్పినా ఆశపడి కొనుక్కోన్న కొత్త ఇల్లు బ్యాంకు లాగేసుకుంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే బెంగళూరు టెకీకి ఎదురైంది.

కేవలం 60 రోజుల్లోనే నడిరోడ్డుపైకి వచ్చేశాడు ఆ టెకీ.. దీనికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు టెకీ జీవితాన్ని ఒక లేఆఫ్ కోలుకోలేని దెబ్బతీసింది. 8 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి ఈఎంఐలు చెల్లించినా వరుసగా మూడు ఈఎంఐలు ఆగిపోయాయనే కారణంతో రూ. 1.2 కోట్ల విలువైన ఇంటిని బ్యాంకు లాగేసుకుంది. దాంతో ఆ టెకీ రోడ్డున పడ్డాడు. ప్రస్తుతం టెకీ కన్నీటి గాథకు సంబంధించి నెట్టింట్లో చర్చ నడుస్తోంది.

అసలేం జరిగిందంటే.. ?
వైరల్ అవుతున్న సోషల్ పోస్టు ప్రకారం.. దాదాపు 8ఏళ్ల క్రితం ఓ బ్యాంకు నుంచి హోం లోన్ తీసుకున్నాడు టెకీ. రూ. 1. 2 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశాడు. చేతిలో సాఫ్ట్ వేర్ జాబ్ ఉండటంతో ప్రతినెలా ఇన్ టైమ్ ఈఎంఐలు పే చేస్తు వచ్చాడు. ఊహించని విధంగా అతడు పనిచేసే కంపెనీలో లేఆఫ్స్ జరిగాయి. ఒక్కసారి తన ఉద్యోగం పోయింది. మరో కొత్త ఉద్యోగం దొరకలేదు. దాంతో నెల జీతం లేకపోవడంతో అతడు కట్టాల్సిన ఈఎంఐలు ఆగిపోయాయి.

వరుసగా 3 ఈఎంఐలు చెల్లించలేదని కారణంతో అతడు లోన్ తీసుకున్న బ్యాంకు కేవలం 60 రోజుల్లోనే కోట్ల విలువైన ఇంటిని వేలం వేసింది. బెంగళూరుకు చెందిన సీఏ మీనల్ గోయల్ తన లింక్ డిన్ లో పోస్టు షేర్ చేయడంతో వైరల్ అయింది. రాజేష్ అనే టెకీ 2025లో జాబ్ కోల్పోయాడు.

Read Also : Amazon Premier League : అమెజాన్‌లో అద్భుతమైన సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఇలాంటి డీల్స్ మళ్లీ జన్మలో రావు!

జనవరి 2026 వరకు వరసగా 3 ఈఎంఐలు చెల్లించలేదు. బ్యాంకు SARFAESI చట్టం కింద రాజేష్ పై నోటీసు జారీ చేసింది. 60 రోజుల వ్యవధిలోనే ఆ కోట్ల ఇల్లు కూడా వేలం వేసింది. రూ. 1.2 కోట్ల విలువైన ఇల్లు కేవలం రూ. 95 లక్షలకే వేలంలో అమ్ముడైంది.

అతడు 8 ఏళ్లు ఈఎంఐలు చెల్లిస్తే అతడికి కేవలం రూ. 15 లక్షలు మాత్రమే చేతికి వచ్చాయి. చెల్లించాల్సిన మొత్తం బకాయి రూ. 80 లక్షలను మాత్రం బ్యాంకు తీసుకుంది. ఈ పోస్టు ఆధారంగా సీఏ మీనల్ గోయల్ హోం లోన్ తీసుకున్నాక అది పూర్తిగా చెల్లించేంతవరకు అది మనది కాదని అన్నారు. హోం లోన్ తీసుకుంటే తప్పనిసరిగా ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర ఉంచుకోవాలని, లోన్ రెన్యువల్ చేయించుకోవడం చేయాలని తెలిపారు. వాస్తవానికి ఈ పోస్టు రెండు వారాల క్రితమే షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇది నిజమేనా? ఎమోషనల్ పోస్ట్‌నా? నెట్టింట్లో తీవ్ర చర్చ :
ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ నిపుణుల నుంచి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. 90 రోజుల డిఫాల్ట్ తర్వాతే అకౌంట్ NPAగా మారుతుందని, వేలం వేసే చట్టపరమైన ప్రక్రియ అంత త్వరగా జరగదని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.

ఫ్లాట్ ధరపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలో ఆస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎనిమిదేళ్ల నాటి ఫ్లాట్ అసలు ధర కంటే తక్కువకు అమ్ముడుపోవడం అనుమానాస్పదమని అంటున్నారు. బ్యాంకులు సాధారణంగా పరిష్కారం కోసం అవకాశం ఇస్తాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.