Best Affordable SUVs : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 7 లక్షల బడ్జెట్ లోపు 5 బెస్ట్ SUVలు.. ఏ కారు ధర ఎంతంటే?

Best Affordable SUVs : కొత్త SUV కారు కొనాలని అనుకుంటున్నారా? రూ. 7 లక్షల బడ్జెట్‌లో కొత్త 5 బెస్ట్ ఎస్‌యూవీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Best Affordable SUVs

  • కొత్త కారు కొనేవారికి అద్భుతమైన న్యూస్
  • రూ. 7 లక్షల బడ్జెట్ ధరలో 5 బెస్ట్ SUV కార్లు ఇవే
  • టాటా పంచ్ నుంచి రెనాల్ట్ కిగర్ వరకు ధర ఎంతంటే?

Best Affordable SUVs : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. భారతీయ మార్కెట్లో మీ బడ్జెట్ ధరలో అనే కార్ల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వివిధ కార్ల తయారీదారులు అనేక మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. అందులో ఎస్‌యూవీలు ఒకటి.

ఆటో మొబైల్ కంపెనీలు అనేక కార్లను తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నాయి. మీరు టాప్-ఆఫ్-ది-లైన్ ఎస్‌యూవీ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే మీ బడ్జెట్ రూ. 7 లక్షలు అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం ఈ 5 బెస్ట్ ఎస్‌యూవీలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా పంచ్ :
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్ SUV తక్కువ ధరలో లభిస్తోంది. మీరు రూ. 7 లక్షల బడ్జెట్‌లో ఈజీగా కొనుగోలు చేయొచ్చు. టాటా పంచ్ ధర రూ. 5.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఇటీవలే ఈ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ లాంచ్ చేసింది. ఈ కారు కూడా మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయొచ్చు.

Read Also : Ind vs Pak World Cup 2026 : వావ్ వండర్‌ఫుల్.. జియో, Vi, ఎయిర్‌టెల్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్‌ ఫ్రీగా చూడొచ్చు..!

హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ కూడా అద్భుతమైన కారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎస్‌యూవీ కంపెనీ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా తక్కువ ధరలో లభిస్తోంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ :
భారత మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి నుంచి ఈ SUV మోడల్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ అతి తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అంటే.. మీ బడ్జెట్‌లో రూ. 7 లక్షల లోపు ధరలో కొనుగోలు చేయవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ :
నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ కూడా అత్యంత సరసమైన ఎస్‌యూవీ కారు. మీ బడ్జెట్‌లో ఈజీగా కొనేసుకోవచ్చు. నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

రెనాల్ట్ కిగర్ :
రెనాల్ట్ కిగర్ అత్యంత చౌకైన కారు. అత్యంత సరసమైన ఎస్‌యూవీలలో ఈ మోడల్ ఒకటి. రూ. 5.76 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఇంటికి తెచ్చుకోవచ్చు.