Best Automatic Cars : సిటీ ట్రాఫిక్‌లో రయ్ రయ్.. క్లచ్, గేర్ టెన్షన్ లేని 5 బెస్ట్ ఆటోమాటిక్ కార్లు.. ఫ్యామిలీలకు బెస్ట్ ఛాయిస్!

Best Automatic Cars : సిటీ ట్రాఫిక్ కోసం భారత మార్కెట్లో లేటెస్ట్ టెక్నాలజీతో బెస్ట్ ఆటోమాటిక్ కార్లు లభ్యమవుతున్నాయి. మారుతి సుజుకి ఆల్టో కె10 నుంచి టాటా టియాగో వరకు ఏ కారు ధర ఎంత? ఫీచర్లు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Best Automatic Cars

  • భారత మార్కెట్లో బెస్ట్ ఆటోమాటిక్ కార్లు
  • నగర ట్రాఫిక్ కోసం మాన్యువల్ కార్ల కన్నా ఆటోమేటిక్ కార్లు మేలు
  • మారుతి సుజుకి ఆల్టో, సెలెరియో, టాటా టియాగో కార్లు

Best Automatic Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? సిటీలో ఎక్కువగా వెళ్తుంటారా? అయితే మీకోసం మార్కెట్లో అద్భుతమైన ఆటోమాటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి నగర ట్రాఫిక్ కోసం ఆటోమేటెడ్ కార్లను తీసుకోవడం చాలా బెటర్. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారును నడపడం చాలా కష్టం. అదే ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లు భారతీయ ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోతాయి.

ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆటోమాటిక్ కార్లలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా కంపెనీలు మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన కార్లను అందిస్తున్నాయి. మీరు ఫస్ట్ టైమ్ కారు కొనాలని చూస్తుంటే మారుతి ఆల్టో K10 నుంచి టయోటా గ్లాంజా వరకు ఏ కారు కొంటారో కొనేసుకోండి. 22kmpl కన్నా ఎక్కువ మైలేజీని అందిస్తాయి. ఇంజిన్ పవర్, ఫీచర్లతో సహా ఈ టాప్ 5 ఆటోమేటిక్ కార్లను ఓసారి లుక్కేయండి..

మారుతి సుజుకి ఆల్టో K10 :
మీ బడ్జెట్ రూ. 5 లక్షలైతే.. మారుతి ఆల్టో K10 AGS (ఆటో గేర్ షిఫ్ట్) వేరియంట్ తీసుకోవచ్చు. రూ. 4.95 లక్షల విలువైన ఈ కారు 1.0-లీటర్ K10C ఇంజిన్‌తో వస్తుంది. ఆన్-రోడ్‌లో 67.58hp పవర్ జనరేట్ చేస్తుంది. కాంపాక్ట్ సైజు, ఇరుకైన వీధుల్లో భారీ ట్రాఫిక్‌లో కూడా వెళ్లగలదు. తక్కువ ధరలో ఆటోమేటిక్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ కారు.

Read Also : OnePlus 13 Price : ఆఫర్ అదిరింది బ్రో.. వన్‌ప్లస్ 13 భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

మారుతి సుజుకి సెలెరియో :
మారుతి సెలెరియో కారు ఆల్టో కన్నా కొంచెం ఎక్కువ స్పేస్, మోడ్రాన్ డిజైన్‌ను కోరుకునే కస్టమర్లను ఆకర్షిస్తుంది. 1.0-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. క్యాబిన్ విశాలంగా అనిపిస్తుంది. ధర రూ. 5.61 లక్షలు ఉంటుంది. సెలెరియో ‘నెక్స్ట్-జెన్ K-సిరీస్’ ఇంజిన్ అత్యధిక మైలేజీని అందిస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీలో డ్రైవింగ్‌ అద్భుతంగా ఉంటుంది.

టాటా టియాగో :
సేఫ్టీ పరంగా టాటా టియాగోకు సాటి లేదు. రూ. 6.31 లక్షల నుంచి AMT వేరియంట్ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో వస్తుంది. 84.82hp పవర్ జనరేట్ చేస్తుంది. భారీ 35-లీటర్ ఫ్యూయిల్ ట్యాంక్ దూర ప్రయాణాలకు బెస్ట్ కారు. టాటా క్వాలిటీ, ప్రీమియం ఇంటీరియర్ సేఫ్టీ, సౌకర్యం విషయంలో కాంప్రమైజ్ కాని ఫ్యామిలీలకు సరైన కారు.

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ :
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కారులో హై-టెక్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్‌ ఉంది. స్మార్ట్ ఆటోమేటిక్ వేరియంట్ రూ. 6.85 లక్షల ధర ఉంటుంది. 81.86hp ఉత్పత్తి చేసే 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. 37-లీటర్ ఫ్యూయిల్ ట్యాంక్, అద్భుతమైన బ్యాక్ సీటుతో ఈ కారు యువత, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్.

టయోటా గ్లాంజా :
మీరు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తుంటే టయోటా గ్లాంజా తీసుకోవచ్చు. ఈ కారు ధర రూ. 7.91 లక్షలు ఉంటుంది. 1.2-లీటర్ ఇంజిన్ 88.50hp, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్‌కు సుమారు 22.94kmpl ఫ్యూయిల్ కెపాసిటీని అందిస్తుంది.