Best Bikes for College Students : కొంటే ఇలాంటి బైకు కొనాలి.. కాలేజీ స్టూడెంట్స్‌కు అదిరిపోయే 5 బైక్స్.. మైలేజీ, స్టైల్ రెండూ సూపర్!

Best Bikes for College Students : కాలేజీ స్టూడెంట్స్ కోసం టీవీఎస్ రైడర్ 125, హోండా ఎస్పీ 125 నుంచి యమహా ఎంటీ-15 వి2 వరకు టాప్ 5 బైక్స్ అందుబాటులో ఉన్నాయి.. ఈ బైకుల ధరలు, మైలేజీ, ఇంజిన్, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Best Bikes for College Students

  • బడ్జెట్‌లో బైక్ కొనాలనుకుంటున్నారా?
  • కాలేజీ స్టూడెంట్స్ కోసం టాప్ 5 బైక్స్
  • లుక్స్ అదుర్స్.. మైలేజీ అద్భుతం

Best Bikes for College Students : కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్‌కు బైక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లాలన్నా, రోజూ కాలేజీకి వెళ్లాలన్నా సొంత బైక్ ఎంతో కంపర్ట్ ఉంటుంది. అయితే బైక్ కొనేటప్పుడు స్టైలిష్ లుక్‌తో పాటు మంచి మైలేజీ, పర్ఫార్మెన్స్, ధర కూడా తప్పక చూసుకోవాలి.. అలాంటి విద్యార్థుల కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ బైక్స్ అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన బైకు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు.. అవేంటో ఓసారి లుక్కేయండి..

1. టీవీఎస్ రైడర్ 125 :
బడ్జెట్‌లో స్పోర్టీ బైక్ కావాలనుకునే వారికి టీవీఎస్ రైడర్ 125 బెస్ట్ ఆప్షన్.. ఈ బైకు ప్రారంభ ధర సుమారు రూ.86,939 ఉంటుంది. మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కనెక్టివిటీ స్పెషల్ ఫీచర్లు.. లీటర్‌కు సుమారు 65 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ మైలేజీ అందిస్తుంది..

2. హోండా SP125 :
మంచి మైలేజీ, ఇంజిన్ రిఫైన్‌మెంట్ కోరుకునే వారికి హోండా ఎస్పీ 125 సరైన ఆప్షన్.. ప్రారంభ ధర సుమారు రూ.91,374 ఉంటుంది. స్మూత్ ఇంజిన్, డిజిటల్ డిస్‌ప్లే, మోడ్రాన్ ఫీచర్లు ఈ బైకు స్పెషాలిటీ.. లీటర్‌కు సుమారు 63 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.

Read Also : Diwali Car Offers 2026 : ఈ దీపావళికి కొత్త కారు కొనేవారికి పండగే.. రూ.43 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు

3. రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 :
స్టైల్, రోడ్ ప్రెజెన్స్ కోరుకునే వారికి హాంటర్ 350 అదిరిపోయే ఆప్షన్. ఈ బైకు ప్రారంభ ధర సుమారు రూ.1,37,640 ఉంటుంది. ఇందులో 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. సిటీతో పాటు హైవే ప్రయాణాలకూ అద్భుతంగా ఉంటుంది. అయితే బరువు, మెయింటెనెన్స్, పెట్రోల్ ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు.

4. బజాజ్ పల్సర్ N160 :
స్పోర్టీ లుక్, మంచి యాక్సిలరేషన్ కోరుకునే యూత్ కోసం పల్సర్ N160 బాగుంటుంది. ధర సుమారు రూ.1,23,007 నుంచి ఉంటుంది. 164.82cc ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ABS అనేవి ఈ బైక్ స్పెషల్ ఫీచర్లుగా చెప్పొచ్చు..

5. యమహా MT-15 వి2 :
అదిరిపోయే స్ట్రీట్‌ఫైటర్ లుక్ కోసం చూస్తుంటే యమహా MT-15 V2 బైక్ చూడొచ్చు. ధర సుమారు రూ.1.9 లక్షలు. 155cc లిక్విడ్ కూల్డ్ VVA ఇంజిన్, తక్కువ బరువు, అద్భుతమైన హ్యాండ్లింగ్ ఈ బైకు ప్లస్ పాయింట్లు. అయితే, ధర కొంచెం ఎక్కువే ఉంటుంది.

ఈ బైకుల ధరలు సుమారు ప్రారంభ ధరలు మాత్రమే. వేరియంట్, సిటీ, ఆన్‌రోడ్ ఛార్జీలను బట్టి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ దగ్గరలోని షోరూమ్‌లో వివరాలు తెలుసుకోవడం బెటర్..