Best Post Office Scheme
Best Post Office Scheme : ప్రస్తుత రోజుల్లో చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులో ఎక్కువగా రిస్క్ ఉంటుందని తెలిసినా అలానే పెడుతుంటారు. ఏదైనా నష్టం వస్తే తెగ బాధపడిపోతుంటారు. అదే మీరు పోస్టాఫీస్ వంటి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడిపెడితే అద్భుతమైన రాబడితో పాటు ఎలాంటి రిస్క్ ఉండదు.
ఇంతకీ ఏ పథకంలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీరు కేవలం రూ. లక్ష పెట్టుబడి పెడితే మీకు రూ. 45వేలు కేవలం వడ్డీని మాత్రమే సంపాదించుకోవచ్చు. ఇలాంటి పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
ప్రస్తుతం సేవింగ్స్ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, రిస్క్ లేకుండా స్టేబుల్ ఇన్ కమ్ కోరుకునే వారికి పోస్టాఫీస్ అందించే పొదుపు పథకాలు అద్భుతమైన ఆప్షన్. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.
అందుకే చాలామంది పోస్టాఫీస్ పథకాలను ఎంచుకుంటారు. పోస్టాఫీస్ అందించే పథకాల్లో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం ఒకటి. తక్కువ సమయంలో మంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇందులో మీరు రూ. లక్ష డిపాజిట్ చేసి రూ. 44,995 వడ్డీని పొందవచ్చు.
ఈ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకం మాదిరిగానే ఉంటుంది. ప్రభుత్వం అందించే గ్యారెంటెడ్ పెట్టుబడి పథకం. మీరు నిర్ణీత కాలానికి ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తుంటారు. మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కింద మీరు వివిధ టర్మ్ అనుగుణంగా డబ్బు డిపాజిట్ చేసి వడ్డీని పొందవచ్చు. మీరు 1, 2, 3, 5 ఏళ్ల కాలవ్యవధితో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీరు కనీసం రూ. 1,000తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
ప్రస్తుత వడ్డీ రేట్లు ఇవే :
ఒక ఏడాది మెచ్యూరిటీ వ్యవధితో పోస్టాఫీస్ పథకాలు ప్రస్తుతం 6.9 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. రెండేళ్ల డిపాజిట్లు 7 శాతం, మూడేళ్ల డిపాజిట్లు 7.1 శాతం, ఐదేళ్ల డిపాజిట్లు 7.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
కాంపౌండింగ్ వడ్డీ :
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై వడ్డీని త్రైమాసికానికి ఒకసారి లెక్కిస్తారు. ప్రతి 3 నెలలకు వడ్డీ మీ అసలుకు యాడ్ అవుతుంది. దాంతో మీరు కాంపౌండ్ వడ్డీని సంపాదిస్తారు. స్కీమ్ టర్మ్ చివరిలో అధిక రాబడిని పొందుతారు.
మీరు సంపాదించిన వడ్డీని ప్రతి ఏడాది చివరిలో మీ సేవింగ్స్ అకౌంటులో డిపాజిట్ చేయవచ్చు. మీరు వడ్డీని విత్ డ్రా చేయకపోతే అది పెరుగుతూనే ఉంటుంది. ఉంటుంది. అసలుకు వడ్డీ యాడ్ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మీరు అసలు, వడ్డీ రెండింటినీ కలిపి విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో 5 ఏళ్ల పాటు రూ.1,00,000 డిపాజిట్ చేస్తే.. మీకు అద్భుతమైన రాబడి వస్తుంది. 7.5శాతం వడ్డీ రేటుతో (త్రైమాసికం), మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ.1,44,995 అందుతుంది. అంటే.. మీరు అందుకునే నికర వడ్డీ రూ.44,995 అవుతుంది అనమాట.
సాధారణ కస్టమర్లకు 5 ఏళ్ల డిపాజిట్‌పై ఏ ప్రధాన బ్యాంకు కూడా 7.5 శాతం వడ్డీని అందించదు. ఈ లెక్కింపు ఆధారంగా బెస్ట్ డిపాజిట్ ప్లాన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. వాస్తవానికి, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది అన్ని వయసుల వారికి ఒకే వడ్డీ రేట్లను అందిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలు లేవు. ఈ పథకంలో 5 ఏళ్ల పాటు చేసిన పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హులు. మీ సమీప పోస్ట్ ఆఫీస్‌లో ఈ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బు డిపాజిట్ చేయొచ్చు.
Disclaimer : పోస్టాఫీసులో పెట్టబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఇందులో పెట్టుబడి పెట్టేముందు మీకు తెలిసిన ఆర్థిక నిపుణులు లేదా దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించండి.