Yamaha FZ Blue Flex : బైక్ మార్కెట్లో యమహా సునామీ.. E85 ఫ్యూయల్‌తో FZ బ్లూ ఫ్లెక్స్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Yamaha FZ Blue Flex : యమహా మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ వచ్చేసింది. E20 నుంచి E85 వరకు ఇథనాల్-మిశ్రమ పెట్రోల్‌తో రన్ అవుతుంది. ఈ బైక్‌కు 149cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ పవర్ అందిస్తుంది.
Yamaha FZ Blue Flex
- యమహా ఫస్ట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ వచ్చేసింది
- ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడుస్తుంది
- ఇంజన్లో ఎలాంటి మార్పు లేదు
Yamaha FZ Blue Flex : యమహా కూడా భారత మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైకు పేరు యమహా FZ బ్లూ ఫ్లెక్స్. కంపెనీ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకు ఇదే.. E20 నుంచి E85 వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడుస్తుంది. ఈ బైకు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.24 లక్షలు. మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇంజన్లో ఎలాంటి మార్పు లేదు.
యమహా కన్నా ముందు సుజుకి గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్, హీరో మోటోకార్ప్ స్ప్లెండర్, HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Yamaha FZ Blue Flex) వెర్షన్‌ను లాంచ్ చేశాయి. యమహా మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లోని ప్రత్యేకతలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తక్కువ పవర్‌తో 149cc ఇంజన్ :
కొత్త యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్, స్టాండర్డ్ ఎఫ్జెడ్లో ఉండే అదే 149cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రన్ అవుతుంది.
అయితే, E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమాలతో నడిచేలా ఈ బైకును అప్డేట్ చేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 11.7hp పవర్‌ను (7,250 rpm), 12.8Nm టార్క్‌ను (6,000rpm) ఉత్పత్తి చేస్తుంది.
స్టాండర్డ్ ఎఫ్ జీ కన్నా 0.7hp తక్కువ పవర్, 0.5 Nm తక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లకు ఇది నార్మల్. ఎందుకంటే.. సాధారణ పెట్రోల్ కన్నా ఇథనాల్‌కు పవర్ సాంద్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది.
Read Also : Renault Kiger : కొత్త SUV కొంటున్నారా? ఈ రెనాల్ట్ కైగర్‌పై ఏకంగా రూ. 1.25 లక్షలు డిస్కౌంట్..!
డిజైన్‌లో పెద్దగా మార్పు లేదు :
కొత్త FZ బైకులో బ్లూ ఫ్లెక్స్ డిజైన్ చాలా వరకు ప్రస్తుత ఎఫ్‌జెడ్ మాదిరిగానే ఉంది. గత ఏడాదిలో లాంచ్ అయిన FZ రేవ్‌లో ఉండే ఎల్ఈడీ హెడ్లైట్నే ఇందులోనూ అమర్చారు. ఫ్యూయల్ ట్యాంక్, ఫాక్స్ ఎయిర్ వెంట్స్, సింగిల్-పీస్ సీట్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్, సింగిల్-ఛానల్ ఏబీఎస్ వంటివి అలాగే ఉన్నాయి. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ అతిపెద్ద మార్పు అని చెప్పొచ్చు. ఈ బైకులో బ్లూ ఫ్లెక్స్‌కు 135 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ బైక్ కెర్బ్ బరువు 139 కేజీలు ఉంటే.. ఎఫ్ జెడ్ రేవ్ కన్నా 3 కేజీలు ఎక్కువ ఉంటుంది.
ధర, లభ్యత :
ప్రస్తుతం ఎఫ్ జెడ్ బ్లూ ఫ్లెక్స్ మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ యమహా బైకు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.24 లక్షలు.
యమహా FZ సిరీస్‌లోని 9 మోడళ్లలో ఈ ధర మిడ్ రేంజ్ ధరకు వస్తుంది. ఈ బైక్‌ను ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులోని కంపెనీ బ్లూ స్క్వేర్ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా కొనేసుకోవచ్చు.
