×
Ad

Best Sedan Cars 2026 : ఫ్యామిలీ కస్టమర్లకు పండగే.. కొత్త కారు కొంటున్నారా? టాప్ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కార్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Best Sedan Cars 2026 : కొత్త సెడాన్ కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే సెడాన్ కార్లలో బెస్ట్ మోడల్స్ ఇవే.. ఏది కావాలో కొనేసుకోవచ్చు..

  • Published On : January 29, 2026 / 06:59 PM IST

Best Sedan Cars 2026

  • కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా?
  • ఫ్యామిలీ కస్టమర్ల కోసం బెస్ట్ సెడాన్ 2026 కార్లు
  • డిజైర్, ఆరా, అమేజ్, స్లావియా కార్ల ధరలివే

Best Sedan Cars 2026 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ కారు కొనాలో తెలియడం లేదా? అయితే, మీకోసం ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన సెడాన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా భారత మార్కెట్లో కార్ల తయారీదారులు వేర్వేరు సెగ్మెంట్లలో అనేక మోడల్ కార్లను అందిస్తుంటారు.

ఇందులో ఎక్కువగా హ్యాచ్‌బ్యాక్‌లు, SUV, సెడాన్‌ల వరకు కార్లు ఉన్నాయి. మీరు ఫ్యామిలీ కస్టమర్లు అయితే సెడాన్‌ కారును కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, స్కోడా స్లావియా అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు..

మారుతి సుజుకి డిజైర్ :
భారత మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి నుంచి సెడాన్ మోడళ్లలో డిజైర్ తీసుకొచ్చింది. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్‌ కూడా ఒకటి. మారుతి సుజుకి డిజైర్‌ కొనాలని అనుకుంటే ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.25 లక్షలు నుంచి లభ్యమవుతుంది.

Read Also : Union Budget 2026 : సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్? ఈసారి బడ్జెట్‌ 2026లో రైలు టిక్కెట్లపై రాయితీ? భారీ అంచనాలివే..!

హ్యుందాయ్ ఆరా :
హ్యుందాయ్ కంపెనీ సరికొత్త సెడాన్ హ్యుందాయ్ ఆరా కూడా బాగా పాపులర్.. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఈ సెడాన్ ఒకటి. హ్యుందాయ్ ఆరా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. అయితే, వేరియంట్‌ బట్టి మార్కెట్లో సెడాన్ ధరలు మారవచ్చు.

హోండా అమేజ్ :
హోండా అమేజ్ కారు మరో బెస్ట్ సెల్లింగ్ సెడాన్ మోడల్. మీరు రూ. 10 లక్షల బడ్జెట్ లోపు హోండా అమేజ్‌ కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. హోండా అమేజ్ ప్రారంభ ధర, ఎక్స్-షోరూమ్, రూ. 7.47 లక్షలు ఉంటుంది.

స్కోడా స్లావియా :
మీ దగ్గర బడ్జెట్ రూ. 10 లక్షలు ఉంటే.. స్కోడా స్లావియా సెడాన్ కొనేసుకోవచ్చు. ఈ కారు అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్లలో ఒకటి. స్కోడా స్లావియా కార్ల ధరలు రూ. 9.99 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్నాయి.