Union Budget 2026 : సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్? ఈసారి బడ్జెట్ 2026లో రైలు టిక్కెట్లపై రాయితీ? భారీ అంచనాలివే..!
Union Budget 2026 : 2026 బడ్జెట్ ముందు సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్ అందించే వార్త.. కరోనా సమయంలో ఎత్తేసిన సీనియర్ సిటిజన్ రైలు టికెట్ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలని భారత రైల్వే పరిశీలిస్తున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి.
Big relief for senior citizens
Union Budget 2026 : కేంద్ర వార్షిక బడ్జెట్ 2026 దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జనవరి 28న ప్రారంభమైన బడ్జెట్ సెషన్ మొత్తం రెండు దశల్లో జరుగుతుంది. ఏప్రిల్ 2, 2026 వరకు బడ్జెట సమావేశాలు కొనసాగుతాయి. ఈసారి బడ్జెట్‌పై భారీగా అంచనాలు పెరిగాయి.
అయితే, బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్ అందించే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ మహమ్మారి నుంచి నిలిపివేసిన సీనియర్ సిటిజన్ రైలు టికెట్ డిస్కౌంట్ తిరిగి ప్రవేశపెట్టడంపై భారత రైల్వే పరిశీలిస్తున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి. ఇది జరిగితే 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు మరోసారి రైలు టిక్కెట్లపై రాయితీలను పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లకు టికెట్ల రాయితీ ఎంత? :
భారతీయ రైల్వే దశాబ్దాలుగా సీనియర్ సిటిజన్లకు ఛార్జీలపై రాయితీని అందిస్తోంది. పురుష ప్రయాణీకులకు 40శాతం వరకు, మహిళా ప్రయాణీకులకు 50శాతం వరకు రాయితీలు అందిస్తోంది. ఈ ప్రయోజనాలు ఎక్కువగా రైల్లో స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీతో సహా దాదాపు అన్ని తరగతులకు వర్తిస్తుంది.
ఎలాంటి కార్డు లేదా స్పెషల్ ప్రాసెస్ అవసరం లేదు. కేవలం వయస్సు రిజిస్టర్ చేసుకుంటే చాలు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్, రైల్వే కౌంటర్లలో ఈ బెనిఫిట్ పొందవచ్చు.
కొవిడ్-19 లాక్డౌన్, పెరిగిన రైల్వే ఛార్జీలు :
మార్చి 2020లో కొవిడ్-19 మహమ్మారి సమయంలో రైలు అనేక సర్వీసులను నిలిపివేసింది. దాంతో ప్రయాణీకుల రద్దీ తగ్గుతు వచ్చింది. దాంతో రైల్వేలు వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. ఈ కాలంలో, సీనియర్ సిటిజన్ రాయితీని తాత్కాలికంగా నిలిపివేశారు.
అప్పట్లోనే రైల్వేలు సబ్సిడీలు అందిస్తుండగా సీనియర్ సిటిజన్ రాయితీలకు ఏటా రూ. 1,600 నుంచి రూ.2వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాయి. మహమ్మారి తర్వాత రైలు సర్వీసులతో పాటు ఛార్జీలు పెరిగాయి. కానీ, సీనియర్ సిటిజన్లకు టికెట్లపై రాయితీని తిరిగి తీసుకురాలేదు.
2026 బడ్జెట్‌పై అంచనాలివే? :
బడ్జెట్2026కు ముందు జరిగిన సమావేశంలో రాయితీ పునరుద్ధరణపై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని తిరిగి తెచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. సీనియర్ సిటిజన్లు రైలు ప్రయాణంలో భారీగా ఉపశమనం పొందుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో దీనిపై ప్రకటించే వచ్చే అవకాశం ఉంది. సినీయర్ సిటిజన్ ప్రయాణికులకు వారి ప్రయాణ ఖర్చులలో ఎక్కువగా తగ్గింపు పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్? :
రైల్వే టికెట్లపై రాయితీని అందిస్తే వృద్ధులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. రైలు ప్రయాణ సమయాల్లో వారికి ఖర్చులు తగ్గుతాయి. ఈ సౌకర్యం ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే వృద్ధులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.
