Best Split ACs : కరెంట్ బిల్లు తక్కువ.. కూలింగ్ మాత్రం సూపర్.. ఈ సమ్మర్‌లో రూ. 35,000 లోపు బెస్ట్ స్ప్లిట్ ఏసీలు
Best Split ACs : రూ. 35,000 లోపు మంచి స్ప్లిట్ ఏసీ కోసం చూస్తుంటే హిటాచీ, ఎల్‌జీ, డైకిన్, బ్లూ స్టార్, హైసెన్స్, లాయిడ్ వంటి అద్భుతమైన ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.
- Sreehari A
- Published On : March 16, 2026 / 10:50 AM IST
Best Split ACs
- అసలే ఎండకాలం.. కొత్త ఏసీ కొంటే ఇప్పుడే కొనేసుకోండి
- రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్ప్లిట్ ఏసీలు
- తక్కువ పవర్ బిల్లులు, ఎక్కువ కూలింగ్ ఇచ్చే ఏసీలు
- హిటాచీ నుంచి బ్లూ స్టార్ వరకు ఏసీల ధరలివే
Best Split ACs : సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత కూడా మొదలైంది. ఎయిర్ కండిషనర్లకు మార్కెట్లో డిమాండ్ వేగంగా పెరుగుతుంది. మీ ఇల్లు లేదా ఆఫీసు కూల్ ఉండాలంటే మంచి ఏసీ ఉండాలి. మీ బడ్జెట్ రూ. 35,000 కన్నా అయితే మార్కెట్లో అనేక అద్భుతమైన స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి.
కొత్త మోడల్‌లు పవర్ ఆదా చేయడమే కాకుండా వంద శాతం కాపర్ కండెన్సర్‌లు, కన్వర్టిబుల్ కూలింగ్, స్మార్ట్ ఫీచర్లు అందిస్తున్నాయి. సరసమైన ధరలో అద్భుతమైన కూలింగ్ అందించే హిటాచీ, LG, డైకిన్, బ్లూ స్టార్, హిసెన్స్, లాయిడ్ వంటి కొన్ని బెస్ట్ ఏసీలు కొనేసుకోవచ్చు.
హిటాచీ 1.5 టన్ 3 స్టార్ ఎక్స్‌పాండబుల్+ ఇన్వర్టర్ ఏసీ :
హిటాచీ నుంచి వచ్చిన ఈ 1.5-టన్ మోడల్ మీడియం-సైజు గదులకు బెస్ట్ ఆప్షన్. ఎక్స్‌పాండబుల్+ టెక్నాలజీతో వస్తుంది. రూమ్ టెంపరేచర్ ప్రకారం కూలింగ్ అందిస్తుంది. వంద శాతం కాపర్ కండెన్సర్, లైఫ్ టైమ్ వస్తుంది.
తక్కువ మెయింట్ నెన్స్ ఖర్చులు ఉంటాయి. ఐస్ క్లీన్ ఫీచర్ పేరుకుపోయిన మురికిని తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఈ ఏసీ ధర సుమారు రూ. 32,999 ధరకు లభిస్తుంది. ఈ ఏసీలో 4-వే స్వింగ్ ఫీచర్ గది అంతటా ఒకేలా కూలింగ్ అందిస్తుంది.
హైసెన్స్, లాయిడ్ బడ్జెట్ ఏసీలు :
రూ. 31వేల ధరలో కొత్త ఏసీ కోసం చూస్తుంటే హైసెన్స్, లాయిడ్ నుంచి 1.5-టన్ను మోడల్‌లు బెస్ట్ ఆప్షన్లు. హైసెన్స్ ఏసీలు 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్‌ను అందిస్తాయి. రిమోట్‌గా కంట్రోలింగ్ పవర్ ఆదా చేయవచ్చు. లాయిడ్ ఏసీలో బ్యాక్టీరియా, డస్ట్ తగ్గించే యాంటీ-వైరల్ ఫిల్టర్ ఉంటుంది. ఈ రెండూ PM2.5 ఫిల్టర్‌తో కూడా వస్తాయి. ఎయిర్ క్లీన్ చేస్తాయి. ధర రూ. 30,990 నుంచి రూ.31,990 మధ్య ఉంటుంది.
ఎల్‌జీ 1 టన్ 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ :
ఎల్‌జీ 1-టన్ 4-స్టార్ ఏసీ మీ ఇంట్లో చిన్న రూమ్ లేదా బెడ్‌రూమ్‌కి బెస్ట్ ఆప్షన్. ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్‌తో వస్తుంది. రూమ్ ఆక్యుపెన్సీ ఆధారంగా కూలింగ్ అందిస్తుంది. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ సౌండ్ రాదు. HD ఫిల్టర్, యాంటీ-వైరస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ధర సుమారు రూ. 34,490 ఉంటుంది.
బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ వై-ఫై స్మార్ట్ ఏసీ :
స్మార్ట్ ఫీచర్లతో ఏసీ కావాలంటే బ్లూ స్టార్ నుంచి ఈ వైఫై స్మార్ట్ ఏసీని తీసుకోండి. 5-స్టార్ మోడల్ వై-ఫై కనెక్టివిటీతో వస్తుంది. మొబైల్ యాప్ ద్వారా ఏసీని ఆన్ చేయొచ్చు. రూమ్ టెంపరేచర్ కంట్రోల్ చేసే డిజిక్యూ హెప్టా సెన్సార్ ఉన్నాయి. 5-స్టార్ రేటింగ్ కారణంగా పవర్ ఆదా చేసుకోవచ్చు. ధర రూ. 34,790 మాత్రమే.
డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ :
ఈ డైకిన్ ఏసీ సుమారు రూ. 34,490 ధరకు లభిస్తుంది. ఈ మోడల్ కోండా ఎయిర్‌ఫ్లో టెక్నాలజీతో వస్తుంది. గది మొత్తం కూల్ అవుతుంది. డ్యూక్లీన్ టెక్నాలజీతో వస్తుంది. ఏసీ లోపల తేమ, బూజు పట్టకుండా క్లీన్ చేస్తుంది. ట్రిపుల్ డిస్‌ప్లే, వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.
