Best SUV Cars 2026 : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 10 లక్షల లోపు టాప్ 5 బెస్ట్ ఫ్యామిలీ SUVలు.. మీ ఫేవరెట్ కారు ఇదేనా?

Best SUV Cars 2026 : టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ ప్రీమియం ఫీచర్లు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ అద్భుతమైన మైలేజ్‌తో భారత మార్కెట్లో గట్టి పోటీగా నిలుస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏ కారు కొంటారో కొనేసుకోండి.

Best SUV Cars 2026

  • కొత్త కారు కొనేవారికి అద్భుతమైన న్యూస్
  • ఫ్యామిలీ కస్టమర్లు తప్పక కొనాల్సిన SUV మోడల్స్
  • రూ. 10 లక్షల బడ్జెట్ ధరలో మీకు నచ్చిన కారు కొనేసుకోవచ్చు

Best SUV Cars 2026 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్యామిలీ కస్టమర్ల కోసం సరసమైన ధరలో లగ్జరీ లుక్ ఫీచర్లను అందించే అద్భుతమైన SUV కార్లు అందుబాటులో ఉన్నాయి. జర్మన్ ఇంజనీరింగ్‌తో స్కోడా క్యాలాక్, బడ్జెట్ కేటగిరీలో దూసుకుపోతోంది.

రూ. 7.50 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ధరలో ఈ SUV కార్లు ఫ్యామిలీ కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. లగ్జరీ కార్లతో పోటీగా అదిరపే ఫీచర్లను అందిస్తున్నాయి. మీ డబ్బుకు తగిన వాల్యూ అందించే ఈ టాప్ 5 SUV కార్ల స్పెసిఫికేషన్లు, మైలేజ్, ప్రత్యేక ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

టాటా నెక్సాన్ :
భారత మార్కెట్లో టాటా నెక్సాన్ అత్యంత సేఫెస్ట్ కారు. మీ ఫ్యామిలీ సేఫ్టీకి సరిగ్గా సరిపోయే కారు. టాటా నెక్సాన్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందిస్తుంది. క్వాలిటీ పరంగా ఫ్యామిలీకి బాగుంటుంది. రూ. 8.00 లక్షల ప్రారంభ ధరతో ఈ SUV కొనేసుకోవచ్చు.

ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్ల వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మీ ప్రయాణం లగ్జరీగా ఉంటుంది. పెట్రోల్‌పై 17.4 కి.మీ/లీ, డీజిల్‌పై 23.2 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. ఫ్యామిలీ బెస్ట్ SUV కారు అని చెప్పొచ్చు.

Read Also : Vivo X300s Launch : వివోనా మజాకా.. ఈసారి 2 కొత్త ఫోన్లు భయ్యా.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ధర కూడా చాలా తక్కువే!

మహీంద్రా XUV 3XO :
స్పీడ్, టార్క్ కోరుకునే వారికి మహీంద్రా XUV 3XO బెస్ట్ కారు. కేవలం రూ. 7.49 లక్షల ప్రారంభ ధరతో ఈ SUV ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పవర్ ఫుల్ టర్బో ఇంజిన్‌ను అందిస్తుంది.

వెనుక సీటులో ముగ్గురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫస్ట్ టైమ్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్‌ను అందిస్తోంది. లీటరుకు 18.8 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. స్టైల్, పవర్ పరంగా యువతను బాగా ఆకట్టుకుంటోంది.

స్కోడా కైలాక్ :
స్కోడా కైలాక్ బడ్జెట్ కేటగిరీలో సంచలనం సృష్టించింది. 1.0L TSI టర్బో పెట్రోల్ ఇంజన్ అత్యంత ఆకర్షణ. ఖరీదైన లగ్జరీ కారు ఉందనే అనుభూతిని ఇస్తుంది. రూ. 7.89 లక్షల ధరలో ఈ SUV క్వాలిటీ, క్లాసిక్ స్కోడా అద్భుతంగా ఉంటుంది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. లీటరుకు సుమారు 19.7 కిలోమీటర్ల ఆకట్టుకునే మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ వెన్యూ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 7.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). నగర ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చాలా కంపర్ట్ ఉంటుంది. మోడ్రాన్ డిజైన్ ‘బేబీ క్రెటా’ అనే ఐడెంటిటీ కూడా ఉంది. వెన్యూ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్, సన్‌రూఫ్ వంటి హై-టెక్ ఫీచర్లు ఉన్నాయి. డీజిల్ ఇంజన్ లీటరుకు 24.2 కిలోమీటర్లతో మైలేజీని అందిస్తుంది. సుదూర ప్రయాణాలు చేసే ఫ్యామిలీలకు తక్కువలో లగ్జరీ కారు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ :
మంచి మైలేజీని ఇచ్చే కారు కావాలంటే మారుతి ఫ్రాంక్స్ తీసుకోండి. డిజైన్, లగ్జరీ లుక్ ఉంటుంది. రూ. 7.51 లక్షల ప్రారంభ ధరతో ఫ్రాంక్స్ వస్తుంది. పెట్రోల్ వేరియంట్‌కు 21.7 కి.మీ/లీ, CNG వేరియంట్‌కు 28.5 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ అద్భుతమైన రీసేల్ వాల్యూ, లో మెయింట్ నెన్స్ ఖర్చులు ఉంటాయి.