NHAI FASTag Alert: వాహనదారులకు NHAI బిగ్ వార్నింగ్.. ఇకపై వాహనం వివరాల్లో చిన్న తప్పు ఉన్నా మీ FASTag బ్లాక్ అయినట్టే..!

NHAI FASTag Update: వాహనదారులు ఈ చిన్న తప్పు చేసిసా మీ ఫాస్టాగ్ అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకులకు ఎన్‌హెచ్ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి..

Nhai Orders Fastag Issuer Banks To Validate Vehicle Registration Numbers

NHAI FASTag : వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైవేలపై ఎక్కువగా వెళ్తుంటారా? అయితే ఇది మీకోసమే.. మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ సరిగా ఉందా? మీరు ఎవరి దగ్గరి నుంచైనా బైక్ లేదా కారు ఉన్నారా? ఫాస్టాగ్ ఏ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉందో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఫాస్ట్ ట్యాగ్ విషయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కఠినంగా వ్యవహరిస్తోంది.

ఇప్పటికే ఈ నెల 15న ఫాస్టాగ్ జారీ చేసే అన్ని బ్యాంకులకు కీలక ఉత్తర్వు జారీ చేసింది. ఇకపై బ్యాంకులు, ఫాస్టాగ్‌లు జారీ చేసిన అన్ని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)ను తప్పనిసరిగా వెరిఫై చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ ఫాస్టాగ్‌పై ఉన్న వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా ఉన్నట్లు తేలితే.. ఆ ఫాస్టాగ్‌ను బ్యాంకులు బ్లాక్‌లిస్ట్ చేయనున్నాయి. దేశంలో ఫాస్టాగ్‌ల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ చర్య తీసుకున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

అసలు సమస్య ఏంటి? :
టోల్ ప్లాజాల వద్ద స్కానర్లు వాహనం ఫాస్టాగ్‌ను స్కాన్ చేసినప్పుడు వాహనం లైసెన్స్ ప్లేట్‌పై ఉన్న నంబరు స్థానంలో మరో నంబర్ సిస్టమ్‌లో కనిపిస్తోందంటూ NHAIకి అనేక ఫిర్యాదులు అందాయి.

ఈ సాంకేతిక లోపం అనేక సమస్యలకు కారణమవుతోంది. ప్రభుత్వ టోల్ పన్ను పక్కదారి పట్టడంతో అమలు కష్టతరంగా మారింది. అంతేకాదు.. ఇలాంటి వాహనాలు మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కింద చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

Read Also :  కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ ఏప్రిల్‌లో రూ. 45వేల లోపు 6 బెస్ట్ సరసమైన ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే :

NHAI ప్రకారం.. చాలా కాలం క్రితం జారీ చేసిన ఫాస్టాగ్‌లకు సంబంధించి తప్పుడు రికార్డులు బయటపడ్డాయి. ఆ సమయంలో, ఫాస్టాగ్ సిస్టమ్ ప్రభుత్వ వాహన (వాహన్) డేటాబేస్‌కు లింక్ చేయలేదు. డాక్యుమెంట్ల వర్క్ మాన్యువల్‌గా జరిగేది. దాంతో తప్పుడు నంబర్లు రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది.

NHAI ఆదేశాలేంటి?

ఎన్‌హెచ్‌ఏఐ బ్యాంకులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. వాహన నంబర్ తప్పుగా లేదా వ్యాలీడ్ కానీ అన్ని ఫాస్టాగ్‌లను గుర్తించాలని బ్యాంకులకు సూచించింది. ఏదైనా ఫాస్టాగ్‌లోని వాహన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా ఉన్నట్లు తేలితే, బ్యాంకు వెంటనే ఆ ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్ చేయాలి. సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని బ్యాంకులను ఆదేశించింది.

ఇది ఎందుకంటే?

రాబోయే రోజుల్లో NHAI మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం.. వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రయాణంలో ఉన్నప్పుడే టోల్ టాక్స్ కట్ అవుతుంది. ఒకవేళ వాహనం నిబంధనలను ఉల్లంఘిస్తే.. వెంంటనే ఇ-నోటీసు జారీ అవుతుంది. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు సంబంధించిన కచ్చితమైన డేటా సిస్టమ్‌లో ఉంటేనే ఇది సాధ్యమంటోంది.