Hyundai Cars Big Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ జనవరిలో హ్యుందాయ్ కార్లపై రూ. 50వేల వరకు డిస్కౌంట్లు..!

Hyundai Cars Big Discounts : వెర్నా సెడాన్ స్టిక్కర్ ధరపై రూ. 10వేల తగ్గింపును పొందుతుంది. రూ. 15వేల అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. మొత్తం బెనిఫిట్స్ రూ. 15వేలు పొందవచ్చు.

Big discounts of up to Rs 50k on Hyundai cars in January 2024

Hyundai Cars Big Discounts : 2024 కొత్త ఏడాదిలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పోర్ట్‌ఫోలియో నుంచి ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 50వేల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో అందించే డిస్కౌంట్లు, మోడల్ లభ్యత, ప్రాంతం, వేరియంట్‌పై కచ్చితమైన తగ్గింపు ఆధారపడి ఉంటుందని గమనించాలి. దయచేసి మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని డీలర్‌ను సంప్రదించండి.

Read Also : Jio Republic Day Offer : జియో రిపబ్లిక్ డే ఆఫర్‌.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అద్భుతమైన డేటా బెనిఫిట్స్..!

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్..
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన గ్రాండ్ ఐ10 నియోస్.. సిఎన్‌జి వేరియంట్‌లు రూ.33వేలు వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో రూ. 20వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3వేలు ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎంటీ ట్రిమ్‌లు (నాన్-సీఎన్‌జీ) రూ. 10వేల క్యాష్ డిస్కౌంట్ పొందగా, ఏటీ వేరియంట్‌లు స్టిక్కర్ ధరపై రూ. 5వేల తగ్గింపును పొందుతాయి. ఇతర రెండు బెనిఫిట్స్ మోడల్ పరిధిలో ఒకే విధంగా ఉంటాయి.

హ్యుందాయ్ ఆరా :
ఆరా కాంపాక్ట్ సెడాన్ మోడల్.. హ్యుందాయ్ సీఎన్‌జీ వేరియంట్‌కు రూ. 15వేల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. మొత్తం రూ. 28వేల వరకు తగ్గుతుంది. మరోవైపు, నాన్-సీఎన్‌జీ ట్రిమ్‌లు రూ. 5వేల తగ్గింపుతో పాటు రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Hyundai cars in January 2024

హ్యుందాయ్ ఐ20 :
హ్యుందాయ్ ఐ20 మోడల్.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ ట్రిమ్‌లకు రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందిస్తోంది. ఈ మోడల్‌కు క్యాష్ డిస్కౌంట్లు, లేదా కార్పొరేట్ ప్రయోజనాలు లేవు. హ్యుందాయ్ వెర్నా గత ఏడాదిలో ఫేస్‌లిఫ్ట్‌ని అందుకున్న వెర్నా సెడాన్, స్టిక్కర్ ధరపై రూ. 10వేల తగ్గింపు, రూ. 15వేల అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందిస్తోంది. మొత్తం రూ. 15వేల వరకు బెనిఫిట్స్ డీల్‌ను పొందవచ్చు.

హ్యుందాయ్ అల్కజార్ :
హ్యుందాయ్ అల్కజార్ మోడల్ ఎస్‌యూవీ‌పై పెట్రోల్, డీజిల్ ట్రిమ్‌ల కోసం రూ. 15వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అయితే మోడల్‌కు ఎలాంటి క్యాష్ డిస్కౌంట్లు లేదా కార్పొరేట్ బోనస్‌లు లేవు.

హ్యుందాయ్ టక్సన్ :
కంపెనీ భారత లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ ఐసీఈ ఎస్‌యూవీ అయిన హ్యుందాయ్ టక్సన్.. డీజిల్ ట్రిమ్‌పై రూ. 50వేల భారీ తగ్గింపును పొందుతుంది. కానీ, ఈ మోడల్‌పై ఇతర డిస్కౌంట్లు అందుబాటులో లేవు.

Read Also : Gaming Laptops Deals 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు