8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లక్కీ టైమ్.. పెన్షన్లు, జీతాలు భారీగా పెరుగుతాయా? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు ఫిక్స్?
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అలర్ట్.. ఏప్రిల్ 13న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకోనుంది? జీతాలు, అలవెన్సులపై చర్చించేందుకు 8వ వేతన సంఘం సమావేశం కానుంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published On : April 10, 2026 / 05:14 PM IST
8th Pay Commission
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్
- ఏప్రిల్ 13న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకునే ఛాన్స్
- జీతాలు, అలవెన్సులపై చర్చకు 8వ వేతన సంఘం సమావేశం
- భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. ఏప్రిల్ 13న (సోమవారం) ఎంతో కీలకమైన రోజు. ఈరోజున జాతీయ సంయుక్త సలహా యంత్రాంగం మండలి (NC-JCM) ముసాయిదా కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 8వ వేతన సంఘానికి సంబంధించిన వాటా మెమోరాండంను ఖరారు చేయనున్నారు.
ఈ సమావేశంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు, అలవెన్సులు, జీతాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. ఉద్యోగులకు సంబంధించిన ఈ సమస్యలపై లోతుగా చర్చిస్తోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సేవా నిబంధనలకు సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను చేర్చి వాటిని కమిషన్ ముందు ఉంచనుంది. గత సమావేశం మార్చి 12న జరిగింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు కమిషన్‌కు అనేక సూచనలు చేశాయి. ఇటీవల, ఎన్‌సీ-జేసీఎం కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా మరో 9 అంశాలను చేర్చాలని కోరుతూ కమిషన్‌కు లేఖ రాశారు. అంతకుముందు, కమిషన్ సంబంధిత వర్గాలందరి నుంచి అభిప్రాయాలను కోరుతూ 18 ప్రశ్నల జాబితాను జారీ చేసింది.
18 నెలల్లోగా కమిషన్ సిఫార్సుల సమర్పణ :
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా, నియమాలను ఖరారు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులను సమర్పించేందుకు ఈ సంఘానికి 18 నెలల గడువు ఇచ్చారు. ఉద్యోగుల జీతభత్యాలు, భత్యాలు, పెన్షన్లు ఇతర ప్రయోజనాలను సమీక్షించాల్సి ఉంది.
ఉద్యోగుల మధ్య అత్యంత చర్చనీయాంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఉద్యోగుల జీతాలను నిర్ణయించేందుకు ఇది తప్పనిసరి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలను పెంచేందుకు 3.25 లేదా అంతకంటే ఎక్కువగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
డీఏ విలీనం కోసం డిమాండ్ :
ప్రస్తుతం, ఉద్యోగులు 58శాతం కరువు భత్యం (డీఏ) పొందుతున్నారు. దీనిని 60 శాతానికి పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాదు.. డీఏను కనీస వేతనానికి కలపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇలా జరిగితే.. కనీస వేతనంతో పాటు హెచ్‌ఆర్‌ఏ, టీఏ, పెన్షన్, గ్రాట్యుటీ వంటి ఇతర బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. ఏప్రిల్ 13వ తేదీ సమావేశం తర్వాత రూపొందించిన మెమోరాండం, వేతన సంఘానికి ప్రాతిపదికగా ఉంటుంది. లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది.
