BMW iX4 Electric SUV : వావ్.. BMW నుంచి సరికొత్త EV కారు.. పవర్‌ఫుల్ లుక్.. సింగిల్ ఛార్జింగ్‌తో 828 కి.మీ ప్రయాణం!

BMW iX4 Electric SUV : BMW iX4 ఎలక్ట్రిక్ SUV 2027 మార్చిలో ప్రపంచ మార్కెట్లోకి రానుంది. 828 కి.మీ రేంజ్‌, 612 HP పవర్‌, ఫాస్ట్ ఛార్జింగ్‌, ఫీచర్లు, భారత లాంచ్ అయ్యే వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

BMW iX4 Electric SUV

  • బీఎండబ్ల్యూ ఇష్టపడేవారైతే ఈ SUV ఎలక్ట్రిక్ కారు మీకోసమే
  • ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్‌? 828 కి.మీ రేంజ్‌తో బీఎండబ్ల్యూ కొత్త ఈవీ
  • 2027లో రానున్న బీఎండబ్ల్యూ iX4.. ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు

BMW iX4 Electric SUV : కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? మీరు బీఎండబ్ల్యూ ఇష్టపడేవారైతే ఇది మీకోసమే.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లలో బీఎండబ్ల్యూ కొత్త iX4 ఎలక్ట్రిక్ SUV-కూపేను మార్కెట్లోకి దించనుంది.

ఆకర్షణీయమైన డిజైన్‌, అడ్వాన్స్ టెక్నాలజీ, లాంగ్ డ్రైవింగ్ రేంజ్‌తో ఈ కారు ప్రపంచ మార్కెట్లోకి మార్చి 2027లో అడుగుపెట్టనుంది. ముందుగా iX4 40, xDrive, iX4 50 xDrive వేరియంట్లు లాంచ్ కానుండగా, హై-పెర్ఫార్మెన్స్ M60 xDrive మోడల్ ఆ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది.

స్పోర్టీ డిజైన్‌తో ప్రీమియం లుక్ :
బీఎండబ్ల్యూ iX4లో వాలుగా ఉండే రూఫ్‌లైన్‌, లాంగ్ వీల్‌బేస్‌, స్మాల్ ఓవర్‌హ్యాంగ్‌లతో స్పోర్టీ లుక్ అందించారు. ఫ్రంట్ సైడ్ కొత్త కిడ్నీ గ్రిల్‌, హెడ్‌లైట్ల స్పెషల్ డిజైన్ ఆకట్టుకుంటాయి. బ్యాక్ సైడ్ సన్నని ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, స్పోర్టీ స్పాయిలర్ ఉన్నాయి. పనోరమిక్ గ్లాస్ రూఫ్‌తో పాటు క్యాబిన్‌లో పనోరమిక్ ఐడ్రైవ్, 3డీ హెడ్‌-అప్ డిస్‌ప్లే, 17.9 అంగుళాల సెంట్రల్ స్క్రీన్ వంటి మోడ్రాన్ ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Vivo X300 FE Price Cut : సూపర్ ఆఫర్ మావా.. ఈ వివో X300 FE ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ధర జస్ట్..!

ఒక్క ఛార్జింగ్‌తో 828 కి.మీ రేంజ్ :
ఐఎక్స్4 50 ఎక్స్ డ్రైవ్ వేరియంట్‌లో 2 ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి 469HP పవర్, 645Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 108.7kWh బ్యాటరీతో డబ్ల్యూఎల్టీపీ స్టాండర్డ్స్ ప్రకారం గరిష్ఠంగా 828 కి.మీ ప్రయాణించవచ్చని బీఎండబ్ల్యూ వెల్లడించింది. ఈ కారు 4.9 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. 800V టెక్నాలజీ, 400kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 10 నిమిషాల్లో 387 కి.మీ దూసుకెళ్లగలదని కంపెనీ తెలిపింది.

612HP పవర్‌తో M60 ఎక్స్‌డ్రైవ్ :
పెర్ఫార్మెన్స్ కోరుకునేవారి కోసం రూపొందించిన బీఎండబ్ల్యూ M60 ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ 612HP పవర్‌, 875Nm టార్క్‌ను అందిస్తుంది. 3.9 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. టాప్ స్పీడ్ గంటకు 240 కి.మీ కాగా, డబ్ల్యూఎల్టీపీ రేంజ్ 777 కి.మీ వరకు ఉంటుందని అంచనా.

అడాప్టివ్ ఎమ్ సస్పెన్షన్‌, స్పోర్ట్ స్టీరింగ్‌, ఎలక్ట్రానిక్ ఎమ్ లాకింగ్ డిఫరెన్షియల్ వంటి స్పెషాలిటీ ఇందులో ఉంది. అయితే, ఇవన్నీ కంపెనీ ప్రకటించిన గణాంకాలు మాత్రమే. వాస్తవ రేంజ్ డ్రైవింగ్ పరిస్థితులను బట్టి మారుతుంది. భారత్‌లో బీఎండబ్ల్యూ iX4 లాంచ్ తేదీ, ధర, వేరియంట్ల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.