New Gas Connection : కొత్త గ్యాస్ కనెక్షన్ లేదా? ఇక టెన్షన్ వద్దు.. ఈ సిలిండర్లు మీకోసమే!
New LPG Gas Connection : కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారా? 5 కేజీలు, 10 కేజీల సిలిండర్లు, రీఫిల్ సదుపాయాలు, పీఎన్జీ కనెక్షన్ ప్రత్యామ్నాయాలపై ఓసారి లుక్కేయండి..
New LPG Gas Connection
- ఎల్పీజీ కనెక్షన్లు బంద్.. అయినా గ్యాస్ పొందే ఛాన్స్.. ఇలా చేయండి
- గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టే మార్గాలు.. 5, 10 కేజీల సిలిండర్లతో ఊరట
- కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ ఆప్షన్లు తెలుసుకోండి!
New LPG Gas Connection : కొత్తగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. గ్యాస్ సరఫరా సమస్యల నేపథ్యంలో కొత్త కనెక్షన్ల జారీపై ఆంక్షలు నెలకొన్నాయి.
దీంతో కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి.. అయితే, చిన్న సైజు గ్యాస్ సిలిండర్లు, పైపుల ద్వారా సరఫరా చేసే పీఎన్జీ కనెక్షన్ వంటి మార్గాలేంటో ఓసారి లుక్కేయండి..
5 కేజీల సిలిండర్ చాలా ఈజీ :
సాధారణ ఎల్పీజీ కనెక్షన్‌కు బదులుగా 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ను పొందడం చాలా ఈజీ. ముఖ్యంగా బ్యాచిలర్లు, వలస కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లలో ఉండేవారికి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా ఈ సిలిండర్లను ఐడెంటిటీ ప్రూఫ్ ఆధారంగా ఎంపిక చేసిన డీలర్ కేంద్రాల్లో పొందవచ్చు.
సాధారణ గృహ కనెక్షన్‌తో పోలిస్తే.. వీటికి సంబంధించిన ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే, అవసరమైన ఐడెంటిటీ డాక్యుమెంట్లు, ధర, రీఫిల్ సదుపాయాలపై మీ సమీపంలోని అధీకృత గ్యాస్ ఏజెన్సీ వద్ద తెలుసుకోవడం మంచిది.
Read Also : Mahalaya Amavasya 2026 : ఈరోజే మహాలయ అమావాస్య.. పితృస్మరణతో పాటు ఈ దానాలు చేయడం మర్చిపోకండి!
10 కేజీల సిలిండర్లు మరో ఆప్షన్ :
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 10 కేజీల సిలిండర్లను కూడా అందిస్తున్నాయి. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్, హెచ్‌పీ నవ్య, భారత్ గ్యాస్ లైట్ వంటి పేర్లతో అందించనున్నాయి. ఈ సిలిండర్ల ధరలు, లభ్యత, రీఫిల్ ఛార్జీలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు సంబంధిత కంపెనీ అధికారిక వివరాలను చెక్ చేయడం బెటర్.
మీ ప్రాంతంలో పీఎన్జీ ఉందా? :
నగరాల్లో పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా చేసే పీఎన్జీ కనెక్షన్ కూడా అద్భుతమైన మార్గం. మీ ప్రాంతంలో పైప్‌లైన్ సదుపాయం ఉంటే సంబంధిత సంస్థను సంప్రదించి అప్లయ్ చేసుకోవచ్చు. అయితే, ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్లకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఒకే ఇల్లు-ఒకే గ్యాస్ విధానం ద్వారా ఒక ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ లేదా పీఎన్జీ కనెక్షన్లలో ఒకటే ఉండాలి. రెండు కనెక్షన్లకు అనుమతి లేదు. పీఎన్జీ కనెక్షన్ తీసుకుంటే ఎల్పీజీ కనెక్షన్లు రద్దు చేసుకోవాలి.
గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆయా సిలిండర్లను వెంటనే సరెండర్ చేయాలి.
Note : కొత్త ఎల్పీజీ కనెక్షన్లపై ఆంక్షల స్థితి, చిన్న సిలిండర్ల లభ్యత మారవచ్చు. నిర్ణయం తీసుకునే ముందు గ్యాస్ కంపెనీ అధికారిక ప్రకటనలు, అధీకృత డీలర్‌ను సంప్రదించండి.
