Chiranjeevi Ram Charan : చరణ్ – చిరంజీవిపై ఈ రూమర్స్ నిజమేనా? వేరే ఇండస్ట్రీ దర్శకులతో..
తాజాగా చిరంజీవి - రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తికర రూమర్స్ వినిపిస్తున్నాయి. (Chiranjeevi Ram Charan)
Chiranjeevi Ram Charan
Chiranjeevi Ram Charan : తాజాగా చిరంజీవి – రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తికర రూమర్స్ వినిపిస్తున్నాయి. పెద్ది తర్వాత సుకుమార్ తెరకెక్కించే RC17 కోసం రెడీ అవుతున్నారు రామ్ చరణ్. ఈ దసరాకి అక్టోబర్ 20న ఈ ప్రస్టేజియస్ సినిమా గ్రాండ్ లాంచ్ ఉంటుందని చర్చ జరుగుతుంది. ఈ సమయంలో రామ్ చరణ్‌కి బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్టోరీ వినిపించారనే ప్రచారం జరుగుతోంది. అపూర్వ లాఖియా తెరకెక్కించిన జంజీర్ సినిమాతోనే బాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు చరణ్. తెలుగులో తుఫాన్ పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడ ఇక్కడ ఫ్లాప్ అయింది.
మరి నిజంగానే అపూర్వ లాఖియా చరణ్ కి స్టోరీ చెప్పారా? దానికి చరణ్ ఓకే చెప్తారా అనేదానిపై అధికారిక ప్రకటన అయితే లేదు.
Also Read : December Fight : డిసెంబర్ లో మిడ్ రేంజ్ హీరోల ఫైట్.. ఒకే రోజు నాలుగు సినిమాలు..
రామ్ చరణ్ విషయంలోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ది ప్యారడైజ్ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాణంలో తెరకెక్కించాల్సిన సినిమా ఆగిపోయందని వార్తలు వస్తన్నాయి. ఒకవేళ ఆ సినిమా ఉన్నా ఇప్పట్లో ఉండదు అనే అంటున్నారు. అంతే కాకుండా రీసెంట్గా తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు మెగాస్టార్‌కి స్టోరీ వినిపించారని న్యూస్ వైరలయ్యింది. డిఫరెంట్ సినిమాలు, రూటెడ్ సినిమాలు చేసే కార్తీక్ సుబ్బరాజు చిరంజీవికి ఓ కొత్త కథ వినిపించారని టాక్ నడుస్తుంది. మరి దానికి చిరంజీవి ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలియదు. దీంతో కాకా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేస్తారని మెగా అభిమానుల అటెన్షన్ పీక్స్‌లో ఉంది.
మరి రామ్ చరణ్, చిరంజీవి తమ నెక్స్ట్ సినిమాలు ఎవరితో చేస్తారో, ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి.
