×
Ad

Post Office MIS Scheme : పోస్టాఫీసులో అదిరే స్కీమ్.. మీ భార్య పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. ప్రతినెలా వద్దన్నా వడ్డీ వస్తూనే ఉంటుంది!

Post Office MIS Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. నెలవారీ పథకంలో చేరితే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఇందులో ఎలా చేరాలి? ఎంత వడ్డీ వస్తుందంటే?

Post Office MIS Scheme

Post Office MIS Scheme : పోస్టాఫీసులో డబ్బులు సేవింగ్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. అదే.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ (MIS) స్కీమ్.. ఇందులో ఒకేసారి పెట్టుబడితో నెలవారీ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

రూ.4 లక్షల పెట్టుబడితో రూ. 2,467 వడ్డీ లభిస్తుంది. 7.4శాతం వడ్డీ రేటు, 5 ఏళ్ల కాలపరిమితి (Post Office MIS Scheme) ప్రభుత్వ హామీతో ఈ పథకం సురక్షితమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఇండియా పోస్ట్ పథకాల ద్వారా అనేక అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ MIS స్కీమ్ ద్వారా ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని కోరుకునేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెడితే చాలు.. ప్రతి నెలా మీ అకౌంటులో వడ్డీ వస్తూనే ఉంటుంది. ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పూర్తిగా ప్రభుత్వం అందించే సురక్షితమైన స్కీమ్.

మీరు రిటైర్మెంట్ లేదా గృహిణి అయినా లేదా చిన్న వ్యాపార యజమాని అయినా ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో ఏడాదికి 7.4శాతం వడ్డీ రేటును అందిస్తుంది. చాలా బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా అద్భుతంగా ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంటులో ప్రతి నెలా క్రమం తప్పకుండా వడ్డీని పొందవచ్చు.

Read Also : Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ నెలలో రూ. 15వేల లోపు 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోండి!

రూ. 4 లక్షలు పెట్టుబడితో వడ్డీ ఎంతంటే? :
మీరు మీ భార్యతో కలిసి ఈ పథకంలో రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం.. అప్పుడు మీకు ప్రతి నెలా ఎంత లాభం వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • పెట్టుబడి మొత్తం : రూ. 4,00,000
  • వడ్డీ రేటు : సంవత్సరానికి 7.4 శాతం
  • మొత్తం వార్షిక వడ్డీ : రూ. 29,600
  • నెలవారీ వడ్డీ : రూ. 29,600 ÷ 12 = రూ. 2,467

రూ.4 లక్షల పెట్టుబడితో ప్రతి నెలా మీ అకౌంటులో స్థిరమైన రూ. 2,467 ఆదాయాన్ని అందుకుంటారు. ఈ పథకం మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకం 5 ఏళ్లలో మెచ్యూరిటీ చెందుతుంది. పోస్టాఫీస్ MIS పథకం 5 ఏళ్లు (60 నెలలు) కాలపరిమితి కలిగి ఉంటుంది.

మీరు ఒకసారి పెట్టుబడి పెట్టాక 5 ఏళ్ల పాటు స్థిర నెలవారీ వడ్డీ మొత్తం లభిస్తుంది. 5 ఏళ్ల తర్వాత మొత్తం అసలు అమౌంట్ తిరిగి వస్తుంది. మీరు కోరుకుంటే మెచ్యూరిటీ తర్వాత అదే పథకంలో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా క్రమం తప్పకుండా ఆదాయాన్ని పొందవచ్చు.

జాయింట్ అకౌంట్ సౌకర్యం :
ఈ పథకంలో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సింగిల్ అకౌంటులో గరిష్టంగా రూ. 9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంటులో (3 మంది వరకు) గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు. భార్యాభర్తలు సంయుక్తంగా రూ. 4 లక్షలు డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా రూ. 2,467 వడ్డీ వారి జాయింట్ అకౌంటులో జమ అవుతుంది. సీనియర్ సిటిజన్లు, గృహిణులు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

ఎంఐఎస్ స్కీమ్ ముఖ్యమైన విషయాలివే :
పోస్టాఫీసు అందించే (MIS) పథకం పొందాలంటే.. ముందుగా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. మీకు అకౌంట్ లేకపోతే ముందుగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ తర్వాత మీ సమీపంలోని పోస్టాఫీసు విజిట్ చేసి ఈజీగా MIS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం ద్వారా కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

MIS స్కీమ్ ఎందుకు బెటర్? :
1. ప్రభుత్వ హామీ, జీరో రిస్క్, 100 శాతం సెక్యూరిటీ
2. సాధారణ ఆదాయం, ప్రతి నెలా స్థిర ఆదాయం.
3. అద్భుతమైన వడ్డీ రేటు 7.4శాతం వరకు వార్షిక రాబడి.
4. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఆప్షన్
5. తిరిగి పెట్టుబడి ఆప్షన్, మెచ్యూరిటీ తర్వాత మళ్ల పెట్టుబడి ఆప్షన్

ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఎవరికంటే? :
ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి బెస్ట్. సేవింగ్స్ నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తులు. ఇంట్లో కూర్చొని స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే గృహిణులు కూడా బెనిఫిట్స్ పొందవచ్చు. చిన్న ఖర్చులపై ప్రతి నెలా స్థిర రాబడి అవసరమయ్యే చిన్న పెట్టుబడిదారులకు కూడా ఈ పథకం అద్భుతంగా ఉంటుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) కేవలం పెట్టుబడి ప్లాన్ మాత్రమే కాదు.. స్థిర ఆదాయాన్ని కూడా అందిస్తుంది. రూ. 4 లక్షల పెట్టుబడి నెలకు రూ. 2,467 స్థిర ఆదాయం గ్యారెంటీ అందిస్తుంది. అది కూడా ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా అందిస్తుంది. పోస్టాఫీస్ అందించే ఈ ప్రభుత్వ పథకాలు చాలా సేఫ్. స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి అద్భుతమైన ఆప్షన్లుగా చెప్పవచ్చు. మీరు కూడా స్థిర నెలవారీ ఆదాయాన్ని కోరుకుంటే పోస్టాఫీస్ MIS పథకం సరైన ఆప్షన్.