Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ నెలలో రూ. 15వేల లోపు 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోండి!

Best 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. రూ. 15వేల బడ్జెట్ ధరలో టాప్ 5 బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.

Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ నెలలో రూ. 15వేల లోపు 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోండి!

Best 5G Phones

Updated On : November 8, 2025 / 11:27 AM IST

Best 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నవంబర్‌లో 5G స్మార్ట్‌ఫోన్‌ ప్లాన్ చేస్తుంటే ఈ స్టోరీ మీకోసమే.. భారత మార్కెట్లో ప్రస్తుతం రూ. 15వేల బడ్జెట్ లోపు టాప్ 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో వివో T4x 5G, పోకో M7 ప్రో 5G, వివో T4 లైట్ 5G, ఒప్పో K13x 5G, పోకో M7 ప్లస్ 5G ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ తర్వాత ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. వివో T4x 5G :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6500mAh భారీ బ్యాటరీతో వస్తుంది. సాధారణ (Best 5G Phones) వినియోగంతో 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్టుతో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.

ఈ ఫోన్ 6500mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 17,999 నుంచి 19శాతం తగ్గింపుతో కేవలం రూ. 14,499కే సొంతం చేసుకోవచ్చు.

2. పోకో M7 ప్రో 5G :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 5110mAh బ్యాటరీతో వస్తుంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్ పరంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 20MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్‌తో 33శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ. 13,999 ధరకు లభిస్తుంది.

Read Also : WhatsApp ChatGPT : యూజర్లకు బిగ్ అలర్ట్.. వాట్సాప్‌లో ఈ తేదీ నుంచి చాట్‌జీపీటీ పనిచేయదు.. చాట్ హిస్టరీ ఇలా సేవ్ చేసుకోండి..!

3. వివో T4 లైట్ 5G :

వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 5G ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ వినియోగం, గేమింగ్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. అయితే, ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. 20శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 13,499కే సొంతం చేసుకోవచ్చు.

4. ఒప్పో K13x 5G :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ పొందవచ్చు. అయితే, ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. ఈ ఫోన్ 21శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ.14,999 ధరకు పొందవచ్చు.

5. పోకో M7 ప్లస్ 5G :
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP ఏఐ ప్రైమరీ కెమెరా పొందుతుంది. 7000mAh లాంగ్ టైమ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 29శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు.