×
Ad

BSNL Affordable Plans : బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్లాన్లు.. 2.5GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్స్.. నెల రోజులు ఫుల్ ఎంజాయ్..!

BSNL Affordable Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్లు అందిస్తోంది. 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, హైస్పీడ్ డేటాను అందిస్తోంది.

BSNL Cheapest plan

BSNL Affordable Plan: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ ఇటీవలే దేశవ్యాప్తంగా 4G సర్వీసులను ప్రారంభించింది. ఈ రీఛార్జ్ ప్లాన్లు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల కన్నా చాలా చౌకగా లభిస్తున్నాయి.

మీరు BSNL కస్టమర్ అయితే సరసమైన ప్లాన్ కోసం (BSNL Affordable Plan) చూస్తుంటే ఇది మీకోసమే.. బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ సరసమైన ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాను అందిస్తుంది. ఈ సరసమైన బీఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ 30 రోజుల ప్లాన్ :
ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 225కు పొందవచ్చు. దేశమంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్‌ అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ప్లాన్ 100 ఫ్రీ ఎస్ఎంఎస్ మెసేజ్‌లను కూడా అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఫ్రీ BiTV యాక్సెస్‌ అందిస్తుంది. 350 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్లు, OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Read Also : Best Washing Machines : ఫ్లిప్‌కార్ట్‌లో ఖతర్నాక్ డీల్స్.. భారీ తగ్గింపు ధరకే టాప్ 3 బెస్ట్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!

30 రోజుల వ్యాలిడిటీ, 2.5GB రోజువారీ డేటాతో ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్‌లు బీఎస్ఎన్ఎల్ కన్నా రూ. 100, రూ.180 మధ్య ధర కలిగి ఉన్నాయి. జియో 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ. 319కు పొందవచ్చు. జియో రూ. 319 ప్లాన్ రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ అందిస్తుంది. ఈ జియో ప్లాన్ రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది.

బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది. డేటా లిమిట్ తర్వాత స్పీడ్ 80kbpsకి తగ్గుతుంది. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 50 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.