Flipkart Sasa Lele Sale : వావ్! ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. రూ. 15వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
Flipkart Sasa Lele Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ సేల్ నడుస్తోంది. మీరు రూ. 15వేల లోపు ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం.
- Sreehari A
- Published on- May 12, 2026 / 09:21 PM IST
Flipkart Sasa Lele Sale
- పోకో M7 ప్లస్ 5జీ ఫోన్ 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499
- శాంసంగ్ గెలాక్సీ F70e 5జీ 4GB/128GB వేరియంట్ ధర రూ. 12,499
- మోటోరోలా G35 5జీ ఫోన్ 4GB/128GB వేరియంట్ రూ. 12,499 ధర
Flipkart Sasa Lele Sale : పోకో M7 ప్లస్ 5G,శాంసంగ్ గెలాక్సీ F70e 5G, మోటోరోలా G35 5G,రియల్‌మి P4 లైట్ 5జీ, రెడ్‌మి 15C 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ సమయంలో ఈ ఫోన్లపై రూ. 15వేల లోపు ధరకే భారీ తగ్గింపు పొందవచ్చు. రూ.15వేల లోపు ఫోన్లపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ఇప్పుడు చూద్దాం..
రూ. 15వేల లోపు స్మార్ట్‌ఫోన్లు :
పోకో M7 ప్లస్ 5జీ ఫోన్ 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,499 ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 1,250 ఆదా చేయవచ్చు. తద్వారా ధర రూ. 9,750 అవుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 9,753 వరకు తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F70e :
శాంసంగ్ గెలాక్సీ 5జీ ఫోన్ 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్‌లో రూ. 12,499కి లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 625 ఆదా చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ధర రూ. 8,950కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 8,950 వరకు ఆదా చేయొచ్చు.
Read Also : Nothing Phone (2a) : కొత్త ఫోన్ కావాలా? నథింగ్ ఫోన్ 2aపై భారీ డిస్కౌంట్, ఏకంగా రూ. 8,000 తగ్గింపు!
మోటోరోలా G35 ఫోన్ :
మోటోరోలా G35 ఫోన్ 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 12,499 ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 625 ఆదా చేసుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఆఫర్లతో అసలు ధర రూ. 12,950 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 8,950 వరకు ఆదా చేసుకోవచ్చు.
రెడ్‌మి 15సీ 5జీ ఫోన్ 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,877కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 1,219 ఆదా చేయవచ్చు.
రియల్‌మి పీ4 లైట్ 5జీ ఫోన్ 4GB/64GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,749 ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ. 1,113 ఆదా చేయవచ్చు.
