Nothing Phone (2a) : కొత్త ఫోన్ కావాలా? నథింగ్ ఫోన్ 2aపై భారీ డిస్కౌంట్, ఏకంగా రూ. 8,000 తగ్గింపు!
Nothing Phone (2a) : నథింగ్ ఫోన్ (2a) 5జీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారు రూ. 8వేలు తక్కువకే లభిస్తుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Nothing Phone 2a
- 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్
- ఈ మోడల్ ఫోన్ 5,000mAh బ్యాటరీ
Nothing Phone (2a) : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? నథింగ్ అభిమానుల కోసం నథింగ్ ఫోన్ (2a) 5జీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కూడా ఉంది. నథింగ్ ఫోన్ (2a) 5జీపై ఆఫర్లు, ధర డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నథింగ్ ఫోన్ (2a) 5జీ ధర, డీల్స్ :
నథింగ్ ఫోన్ (2a) 5జీ మోడల్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 23,999తో పోలిస్తే.. ఇప్పుడు రూ. 16,601కి లిస్ట్ అయింది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసే పేమెంట్లపై 5శాతం తగ్గింపు (రూ. 1,500 వరకు) బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు. మొత్తం తగ్గింపు ధర రూ. 15,770 అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారు రూ. 8వేలు తక్కువకే లభిస్తుంది.
Read Also : DA Hike : ఈ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త! డీఏ 60 శాతం పెంపు.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎవరికి ఎంతంటే?
నథింగ్ ఫోన్ 2a 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 2a 5జీలో 1080×2412 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5పై రన్ అవుతుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
నథింగ్ ఫోన్ 2a బ్యాక్ సైడ్ ఎఫ్/1.88 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
కొలతల విషయానికి వస్తే.. ఈ నథింగ్ ఫోన్ 161.74 మిమీ పొడవు, 76.32 మిమీ వెడల్పు, 8.55 మిమీ మందం, 190 గ్రాముల బరువుతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
