DA Hike : ఈ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త! డీఏ 60 శాతం పెంపు.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎవరికి ఎంతంటే?
DA Hike : తపాలా శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ డీఏ ఇప్పుడు 60 శాతానికి పెరిగింది. ఈ కొత్త రేటు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. దాంతో లక్షలాది తపాలా ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి.
DA Hike
- భారీగా పెరగనున్న గ్రామీణ తపాలా కార్మికుల జీతాలు
- డీఏ 60శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం
- డాక్ సేవకులకు డీఏ పెంపు జనవరి, 1, 2026 నుంచి అమల్లోకి
DA Hike : గ్రామీణ డాక్ సేవకులకు (జీడీఎస్) బిగ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) పెంచింది. ఇకపై గ్రామీణ డాక్ సేవకులు జనవరి 1, 2026 నుంచి తమ ప్రాథమిక టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఎ)పై 60 శాతం డీఏ పొందుతారు.
తపాలా శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. కేంద్ర ఉద్యోగుల డీఏకు సమానమైన బెనిఫిట్స్ అందించాలనే (DA Hike) లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగుల నెలవారీ ఆదాయం నేరుగా పెరుగుతుంది.
మే 10, 2026న జారీ చేసిన ఉత్తర్వులో గ్రామీణ తపాలా కార్మికులు ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన డీఏ రేటును పొందుతారని తపాలా శాఖ స్పష్టంగా పేర్కొంది. గతంలో 58శాతంగా ఉన్న డీఏ రేటును 60 శాతానికి పెంచారు. ఏప్రిల్ 22, 2026న ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం జారీ చేసిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఈ నిర్ణయం అమలు అవుతుంది.
నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు ఉపశమనం కల్పించడం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ పెంపు ఉద్యోగుల జీతాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు.. ఒక గ్రామీణ డాక్ సేవక్ కనీస వేతనం రూ. 20వేలు అయితే ఇప్పుడు రూ. 12,000 డీఏ (DA) పొందుతారు. దాంతో వారి మొత్తం నెల జీతం రూ. 32వేలకు పెరుగుతుంది.
అదేవిధంగా, రూ. 25వేల కనీస వేతనం పొందుతున్న ఉద్యోగి రూ. 15వేలు డీఏ పొందుతారు. వారి మొత్తం జీతం రూ. 40వేలు అవుతుంది. పెరిగిన డీఏ ఉద్యోగులకు నెలవారీ సేవింగ్, గృహ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.
| ప్రాథమిక జీతం | 60% డీఏ | మొత్తం జీతం |
|---|---|---|
| రూ.10,000 | రూ.6,000 | రూ.16,000 |
| రూ.12,500 | రూ.7,500 | రూ.20,000 |
| రూ.15,000 | రూ.9,000 | రూ.24,000 |
| రూ.17,500 | రూ.10,500 | రూ.28,000 |
| రూ.20,000 | రూ.12,000 | రూ.32,000 |
| రూ.22,500 | రూ.13,500 | రూ.36,000 |
| రూ.25,000 | రూ.15,000 | రూ.40,000 |
డీఏ పెంపు ఎందుకంటే? :
వాస్తవానికి, ద్రవ్యోల్బణం నుంచి రిలీఫ్ కోసం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) అందిస్తారు. మార్కెట్లో ఆహారం, ఇంధనం, విద్యుత్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఉద్యోగుల ఆదాయాలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రభుత్వం డీఏను పెంచుతుంది. అందుకే డీఏలో ప్రతి పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే డీఏ, డీఆర్ రేట్లను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల 2శాతం పెంపును ఆమోదించింది. తద్వారా గ్రామీణ తపాలా కార్మికులు కూడా లబ్ధి పొందుతారు.
ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నేపథ్యంలో ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చింది.
