Personal Finance Tips : ఈ వయస్సులో కారు కొనాలా? ఇన్వెస్ట్ చేయాలా? ఈ ఒక్క నిర్ణయం మీ ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుంది!

Personal Finance Tips : మీకు 20 నుంచి 25 ఏళ్లు ఉంటాయా? సొంత కారు కొనాలని ఉందా? ఈ వయస్సులో కారు కొనాలా? లేదా పెట్టుబడి పెట్టాలా? ఏది సరైన నిర్ణయమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Personal Finance Tips

  • ఏ వయస్సులో కారు కొంటే బెస్ట్? ఇన్వెస్ట్ చేయాలా? వద్దా?
  • కారు కొనడం కన్నా ఇన్వెస్ట్ చేయడమే మేలు ఎందుకంటే?
  • డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీగా కూడబెట్టుకోవచ్చు

Personal Finance Tips : ప్రస్తుత రోజుల్లో బాగా సంపాదించే వారంతా భారీ డ్రీమ్స్ పెట్టుకుంటారు. కొత్త కారు కొనాలి? లేదా కొత్త ఇల్లు కొనాలి? ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ముఖ్యంగా 20 ఏళ్ల వయస్సులో మంచి ఉద్యోగం లక్షల్లో జీతం తీసుకుంటూ అద్భుతమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. యువతలో చాలామందికి సొంత కారు కొనడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది.

అందులో 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల యువత కూడా ఇలానే ఆలోచిస్తుంటారు. మీరు కూడా ఇదే వయస్సులో ఉండి సొంత కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి ఈ వయస్సులో ఏ నిర్ణయం సరైనదో తప్పక తెలిసి ఉండాలి. కారు కొనడమా లేక మీ డబ్బును పెట్టుబడిగా పెట్టడమా? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

25ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టడం :
మీరు 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెడితే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువగా చక్రవడ్డీ నుంచి ప్రయోజనం పొందుతారు. తద్వారా భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టుకుంటారు. అందుకే ఈ వయస్సులో మీరు మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ వంటి ప్లాన్లలో పెట్టుబడి పెట్టవచ్చు. కారు కొనడానికి బదులుగా పెట్టుబడి పెట్టడం నిజంగా చాలా బెస్ట్..

Read Also : EPFO Update : పీఎఫ్ ఖాతాదారులకు కొత్త EPFO రూల్.. ATMలో పీఎఫ్ డబ్బులు తీస్తే Tax తగ్గుతుందా? ఫుల్ డిటెయిల్స్

20 ఏళ్ల వయస్సులో కారు కొనడం :
కారు కొనుగోలు విషయానికి వస్తే.. కాలక్రమేణా కారు ధర తగ్గుతుంది. ఒక కొత్త కారు సాధారణంగా మొదటి సంవత్సరంలోనే 20 శాతం నుంచి 30 శాతం వరకు చౌకగా మారుతుంది. అయితే, కాలక్రమేణా పెట్టుబడి పెరుగుతుంది.

కారు కొనేందుకు లక్షల రూపాయలు అవసరం. కొనుగోలు చేశాక బీమా, పెట్రోల్, డీజిల్, మెయింట్ నెన్స్, సర్వీసింగ్, పార్కింగ్, రిజిస్ట్రేషన్ వంటి అదనపు ఖర్చులు తలెత్తుతాయి. అందుకే కారు కొనాలా? వద్దా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

కారు ఎప్పుడు కొనాలి? :
మీరు జాబ్ కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే కారు కొనడం మంచిది. పబ్లిక్ ట్రావెలింగ్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. సొంత కారు ఉంటే ఆ భారాన్ని కొద్దివరకు తగ్గించుకోవచ్చు. మీ ఆదాయం బాగుంటే కొత్త కారు తీసుకోవడమే బెటర్. అయితే, కారు లోను తీసుకుంటామంటే తప్పకుండా 20 శాతం డౌన్ పేమెంట్ చేయండి. ఆపై మీ ఈఎంఐ నెలవారీ ఆదాయంలో 10 శాతం నుంచి 15 శాతానికి మించకుండా చూసుకోండి.