Lpg gas consumption : ఇలా చేస్తే 50 శాతం గ్యాస్‌ను ఆదా చేయొచ్చు.. చాలా చిన్నవే కానీ..
చిన్న చిన్న పనుల ద్వారా 30 నుంచి 50 శాతం వరకు ఎల్పీజీ గ్యాస్‌ను (Lpg gas consumption) ఆదా చేయవచ్చునని పలువురు నిపుణులు చెబుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : March 13, 2026 / 05:01 PM IST
By using these simple tips reduce Lpg gas consumption nearly 50 percent
Lpg gas consumption : పశ్చియాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో గ్యాస్ కొరతపై చర్చ జరుగుతోంది. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే అది మన వంట గదిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. యుద్ధం ఇలాగే మరికొన్నాళ్ల పాటు కొనసాగితే గ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో సామాన్యుడికి కంటి మీద కునుక లేకుండా పోతోంది.
ఇప్పటికే గ్యాస్ కొరత ప్రభావం పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. పలు చోట్ల హాస్టళ్లను మూసి వేస్తుండగా ఇంకొన్ని చోట్ల హోటళ్లలో పదార్థాలకు రేట్లను పెంచేస్తున్నారు. కొన్ని ఆఫీసుల్లో క్యాంటిన్ల మెనూను తగ్గిస్తుండగా, ఇంకొన్ని ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని ఉద్యోగులకు ఇస్తున్నాయి. గ్యాస్ కొరత అంటూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.
ఈ సమయంలో గ్యాస్‌ను ఆదా చేసేందుకు ఉన్న అవకాశాలను ఓ సారి చూద్దాం..
ప్రెషర్ కుక్కర్ వాడడం, వంట పాత్రలపై మూతలు పెట్టడం, పప్పులను ముందుగా నానబెట్టడం, చిన్న మంట వాడటం, బర్నర్లను శుభ్రం చేయడం వంటి చిన్న చిన్న పనుల ద్వారా 30 నుంచి 50 శాతం వరకు ఎల్పీజీ గ్యాస్‌ను ఆదా చేయవచ్చునని పలువురు నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ ఆదా చేయడానికి ముఖ్యమైన చిట్కాలు ఇవే..
* ప్రెషర్ కుక్కర్ వాడడం..
ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం ద్వారా చాలా గ్యాస్‌ను ఆదా చేయొచ్చు. అన్నం, పప్పులు, కూరగాయాలు వంటివి ఇందులో చాలా తొందరగా ఉడుకుతాయి. అలా కాకుండా గిన్నెల్లో వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది.
* పాత్రలపై మూతలు పెట్టడం..
కొంత మంది వంట చేసే సమయంలో గిన్నెలపై మూతలు పెట్టరు. ఇలా చేయడం వల్ల ఆహారం తొందరగా ఉడకదు. ఎక్కువ గ్యాస్ ఖర్చుఅవుతుంది. అలా కాకుండా గిన్నెలపై మూతలు పెడితే వేడి బయటకు పోకుండా ఉంటుంది. దీంతో వంట కూడా చాలా తొందరగా పూర్తి కావడంతో పాటు గ్యాస్ ఆదా అవుతుంది.
Sara Tendulkar : సోదరుడి పెళ్లిలో సచిన్ కూతురు సందడి చూశారా? ఫోటోలు వైరల్..
* ముందుగా నానబెట్టడం..
పప్పులు, బియ్యం, చిక్కుళ్లు వంటి వాటిని వండడానికి ముందు 15 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల వంట సమయం తగ్గుతుంది.
*సరైన పాత్రల ఎంపిక..
వెడల్పైన, అడుగు మందంగా ఉన్న పాత్రలను ఉపయోగించడం ద్వారా వేడి సమానంగా వ్యాపించి వంట త్వరగా పూర్తి అవుతుంది. తడి గిన్నెతో వంట చేస్తే వేడి ఎక్కేందుకు సమయం పడుతుంది. కాబట్టి పొడి గిన్నెలను ఉపయోగించాలి.
*చిన్న మంటతో వంట..
పెద్ద మంట కంటే చిన్న మంటపై వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. పాత్రల అడుగుభాగం రంగు మారదు.
*అన్నీ సిద్ధం చేసుకుని
చాలా మంది వంట గ్యాస్ ఆన్ చేసిన తరువాత మిగిలిన సామాన్య కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి వంటకు కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకుని, కూరగాయలు కోసి పెట్టుకుని, దినుసులు అందుబాటులో ఉంచుకుని వంట మొదలు పెట్టడం వల్ల ఎలాంటి హడావుడి లేకుండా చాలా తక్కువ గ్యాస్‌తోనే వంట పూర్తి అవుతుంది.
*బర్నర్లను శుభ్రం చేయడం..
బర్నర్‌లోని రంధ్రాలు మూసుకుపోతే గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి బర్నర్ రంధ్రాలు మూసుకుపోకుండా ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలి.
Puri Jagannadh daughter : పూరిజగన్నాథ్ కూతురు ఎంతగా మారిపోయిందో చూశారా?
*ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే కాకుండా..
రిఫ్రిజిరేటర్ నుండి తీసిన ఆహారాన్ని వెంటనే వేడి చేయకూడదు. అది గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వేడి చేయడం ద్వారా గ్యాస్ వృథాను అరికట్ట వచ్చు.
