Credit UPI Payments : చిన్న UPI పేమెంట్లకు క్రెడిట్ కార్డు వాడితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా? పడిపోతుందా? అసలు నిజం ఇదే!
Credit UPI Payments : మీరు చిన్న యూపీఐ పేమెంట్ల కోసం క్రెడిట్ కార్డ్‌ను వాడుతున్నారా? ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని అనుకుంటున్నారా? ఇందులో నిజమెంత? ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published On : March 22, 2026 / 06:34 PM IST
Credit UPI Payments
- క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు ఎక్కువగా చేయొచ్చా?
- చిన్న యూపీఐ లావాదీవీలకు క్రెడిట్ కార్డు పదేపదే వాడొచ్చా?
- ఎక్కువగా యూపీఐ పేమెంట్లు చేస్తే క్రెడిట్ స్కోరు పెరుగుతుందా?
Credit UPI Payments : మీకు క్రెడిట్ కార్డు ఉందా? చేతిలో కార్డు ఉంది కాదని ఉంది కదా అని యూపీఐ పేమెంట్ల కోసం తెగ వాడేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుత రోజుల్లో చాలామంది యూపీఐ పేమెంట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పెద్ద లావాదేవీలకైనా, చిన్న లావాదేవీలకైనా తరచుగా యూపీఐ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డులు కూడా యూపీఐతో లింక్ అయి ఉంటున్నాయి.
అందులో రూపే కార్డు వంటి క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. దాంతో క్రెడిట్ కార్డు ఉంది కదా అని ప్రతి చిన్న యూపీఐ పేమెంట్ కోసం క్రెడిట్ కార్డులను వాడేయడం ఈజీగా మారింది. మీరు కూడా ఇలానే చిన్న యూపీఐ పేమెంట్లకు కూడా క్రెడిట్ కార్డు వాడుతూ క్రెడిట్ స్కోరు పెరుగుతుంది కదా అని అనుకుంటున్నారా?
చాలామంది ఇలానే ఆలోచిస్తుంటారు. వాస్తవానికి, ఇలా యూపీఐ పేమెంట్లు చేయడం వల్ల క్రెడిట్ స్కోరు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, నెల తిరిగేసరికి మీరు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు మీ జేబుకు చిల్లు పెడుతుందని తెలుసా? అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
యూపీఐ పేమెంట్లకు క్రెడిట్ కార్డ్ వాడకం సేఫేనా? :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ క్రెడిట్ స్కోర్‌పై మీ పేమెంట్ చేసే విధానం ఆధారంగానే ప్రభావం పడుతుంది. మీ పేమెంట్లు ఎలా? ఎప్పుడు చేస్తారు అనేదాని బట్టి మారుతుంటుంది. ఎక్కువ సార్లు క్రెడిట్ కార్డుతో యూపీఐతో పేమెంట్లు చేస్తే క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం చూపదు.
కానీ, చాలామంది చేసే తప్పు ఏంటంటే.. క్రెడిట్ కార్డు వాడుతారు కానీ, మొత్తం బిల్లు ఒకేసారి పేమెంట్ చేయరు. లేదా మిస్ చేస్తుంటారు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇలా చేస్తే మాత్రం క్రెడిట్ స్కోరు భారీగా దెబ్బతింటుంది.
మీరు నెల పొడవునా చిన్న మొత్తంలో లావాదేవీలు చేసి ప్రతిసారీ పూర్తి బిల్లును సకాలంలో చెల్లిస్తుంటే అది మీ క్రెడిట్ ప్రొఫైల్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డు వాడి అది బిల్లు గడువు తేదీలోగా ఫుల్ పేమెంట్ చేస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఒక్క పేమెంట్ మిస్ అయినా ఖతమే :
అయితే, క్రెడిట్ కార్డులతో పేమెంట్లు చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ కూడా బాగుంటుంది. సకాలంలో పేమెంట్లు చేసేవారికి మంచి సిబిల్ స్కోరు రికార్డు పెరుగుతుంది. క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేయడం కన్నా యూపీఐ ద్వారా పేమెంట్లు చేయడం చాలా డేంజర్. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా తరచుగా యూపీఐ పేమెంట్లు చేస్తుంటే మీకు తెలియకుండానే భారీ బిల్లు పెరిగిపోతుంది. అంత పెద్ద మొత్తంలో మీరు పేమెంట్లు చేయలేకపోవచ్చు.
అది మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీ క్రెడిట్ కార్డును పరిమితంగానే ఖర్చు చేయండి. ఒక్క పేమెంట్ కట్టడం మిస్ అయినా కూడా మీ సిబిల్ స్కోరు భారీగా పడిపోవచ్చు.
మీ క్రెడిట్ కార్డ్ మొత్తం లిమిట్‌లో 30 శాతం లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే, డెబిట్ కార్డుతో ఎలాగైతే జాగ్రత్తగా ఉంటారో యూపీఐ పేమెంట్లు చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భారీగా ఖర్చులు పెరిగి అప్పులపాలవుతారు.
