Good Credit Score : క్రెడిట్ కార్డ్ లేకున్నా మంచి క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు తెలుసా? ఇలా చేయండి!
Good Credit Score : క్రెడిట్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డు ఒక్కటే కాదు.. అది లేకుండా కూడా క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. మీరు బాధ్యతగా అన్ని పేమెంట్లు సరిగా చేస్తుంటే మీ క్రెడిట్ హిస్టరీలో రికార్డు అవుతుంది. అప్పుడు క్రెడిట్ కార్డు లేకున్నా క్రెడిట్ ప్రొఫైల్ పెరుగుతుంది. అది ఎలాగంటే?
- Sreehari A
- Published On : April 13, 2026 / 08:25 PM IST
Good Credit Score : మీకు క్రెడిట్ కార్డు లేదా? మరి క్రెడిట్ స్కోరు ఎలా పెరుగుతుంది? బ్యాంకు లోన్లు రావాలంటే తప్పనిసరిగా క్రెడిట్ స్కోరు బాగుండాలి. లేదంటే బ్యాంకులు మీకు లోన్లు ఇచ్చేందుకు ముందుకు రావు. అయితే, అసలు క్రెడిట్ స్కోరు ఎలా పెరుగుతుంది? ప్రస్తుతం క్రెడిట్ స్కోరు పెరగాలంటే క్రెడిట్ కార్డు ఉండాలా? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. మరికొంతమంది అయితే క్రెడిట్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డు కూడా ఉండాలని భావిస్తుంటారు.
క్రెడిట్ కార్డు లేకుండా కూడా మంచి క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చునని తెలుసా? మంచి క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి కేవలం క్రెడిట్ కార్డ్‌పై మాత్రమే ఆధారపడి ఉండదని గమనించాలి. మీరు ఏదైనా ఆన్‌లైన్‌లో బిల్లులు పేమెంట్ చేసేటప్పుడు అవన్నీ సకాలంలో చెల్లిస్తుండాలి. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకుండా కూడా మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను పెంచుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డ్ లేకుండా క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి? : మీరు క్రెడిట్ కార్డ్ లేకుండా కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. ఏదైనా ఒక చిన్న మొత్తంలో లోన్ తీసుకోవాలి. అది సకాలంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఈ లోన్ మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తీసుకోవచ్చు.
మీరు ఈఎంఐలో ఏదైనా వస్తువు కొనుగోలు చేసి సకాలంలో చెల్లించవచ్చు. అది కూడా మీ క్రెడిట్ హిస్టరీని పెంచుతుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచడంలో సాయపడుతుంది. పవర్ బిల్లు, అద్దె, మొబైల్, సబ్‌స్క్రిప్షన్‌ల వంటి బిల్లులను కూడా సకాలంలో చెల్లిస్తూ ఉండాలి.
మీకు ఉద్యోగం లేదా ఏదైనా ఇతర ఆదాయం ఉండాలి. మీరు ఈఎంఐలు చెల్లించగలరనే నమ్మకం బ్యాంకులకు కలగాలి. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లలో స్థిరమైన ఆదాయాన్ని చూపించాలి. ఇలాంటివి అన్ని సక్రమంగా ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ లేకుండానే మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు.
క్రెడిట్ స్కోరు పెరగాలంటే ఎంత సమయం పడుతుంది? : మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మీరు కొంచెం సమయం వేచి ఉండాలి. కొన్ని రోజుల్లో లేదా ఒక నెలలో క్రెడిట్ స్కోరు పెరగదు. దీనికి కనీసం 6 నెలల నుంచి ఒక సంవత్సరం పట్టవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్ అనేది మీ గత లోన్లు, ఎలా చెల్లించారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మీ లోన్లు తిరిగి చెల్లించడంలో ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది బ్యాంకులు, NBFC సంస్థలు తెలుసుకుంటాయి.
