8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. 338 శాతం పెరగనున్న ఉద్యోగుల జీతాలు? 5 ఫ్యాక్టర్ ఫార్ములా లెక్కలివే..!

8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చింది.. సీనియర్ ఉద్యోగుల 338 శాతం జీతం పెంపుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. 5 ఫ్యాక్టర్ ఫార్ములా లెక్కలపై ఓసారి లుక్కేయండి..

8th Pay Commission salary

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. అతి త్వరలో భారీ మొత్తంలో జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 8వ వేతన సంఘం ఉద్యోగ సంఘాలు, సిబ్బంది అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) 8వ వేతన సంఘానికి కీలక ప్రతిపాదన చేసింది. ఇప్పుడు ఈ ప్రతిపాదన ఉద్యోగుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఈ ప్రతిపాదనలో 5 విభిన్న ఫిట్‌మెంట్ అంశాలను సూచించింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు (8th Pay Commission) ఉద్యోగి వేతన స్థాయిని బట్టి జీతాలు దాదాపు 192శాతం నుంచి 338 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. కేంద్ర ప్రభుత్వ సర్వీసులన్నింటిలో వేతనాలు భారీ మొత్తంలో పెరగొచ్చు. అయితే, ఈ ప్రతిపాదన గత వేతన సంఘాలకు చాలా భిన్నంగా ఉంది. చాలావరకు ఉద్యోగులందరికీ ఒకే జాయింట్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ ఉండేది. ఇకపై అలా కాకుండా IRTSA వివిధ వేతన స్థాయిలకు వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను సిఫార్సు చేసింది.

‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ ఏంటి?
సాధారణంగా ఉద్యోగి ప్రస్తుత బేసిక్ జీతాన్ని కొత్త వేతన నిర్మాణంలోకి మార్చేందుకు వాడే గుణకాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఉదాహరణకు.. 7వ వేతన సంఘంలో ఎక్కువమందికి 2.57 ఫ్యాక్టర్ ఇచ్చారు. అదే జీతాన్ని భారీగా పెంచారు. దాంతో 6వ వేతన సంఘం కింద రూ. 7వేలుగా కనీస వేతనం రూ. 18వేలకు పెరిగింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే సవరించిన కనీస వేతనంలో పెంపు అంత ఎక్కువగా ఉంటుంది అనమాట.

Read Also : Financial Rules : బిగ్ అప్‌డేట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. UPI, ATM, PAN నిబంధనల్లో భారీ మార్పులివే!

కొత్త 5 ఫ్యాక్టర్ ఫార్ములా ఇదే :
(IRTSA) మొత్తం 5 రకాల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను సూచించింది.

  • లెవల్ 1 నుంచి 5 : 2.92
  • లెవల్ 6 నుంచి 8 : 3.50
  • లెవల్ 9 నుంచి 12 : 3.80
  • లెవల్ 13 నుంచి 16 : 4.09
  • లెవల్ 17 నుంచి 18 : 4.38

338 శాతం పెంపు ఎలాగంటే? :
హైయర్ లెవల్ (17–18) ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ శాలరీ సుమారు రూ. 2.5 లక్షలు. అలాగే ప్రతిపాదిత 4.38 ఫ్యాక్టర్ అమలు చేస్తే.. అప్పుడు సుమారు రూ. 10.95 లక్షలు అవుతుంది. DA, HRA కాకుండా కేవలం బేసిక్ జీతంలోనే పెరుగుదల సుమారు 338శాతం వరకు ఉంటుంది.

  • ప్రస్తుత కనీస వేతనం : రూ. 2,50,000
  • ప్రతిపాదిత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ : 4.38
  • సవరించిన కనీస వేతనం : రూ. 10,95,000

కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యం, ఇతర ప్రయోజనాలు కలపకముందే కేవలం కనీస వేతనంలోనే సుమారు 338 శాతం పెరుగుదల ఉంటుందని అర్థం.

ఇతర ఉద్యోగులకు లాభమా? :
ఈ ఫార్ములా ప్రకారం లెక్కిస్తే.. లో-గ్రేడ్ ఉద్యోగులకు రూ. 18వేల నుంచి రూ. 52,600 వరకు జీతాలు పెరగవచ్చు. మిడిల్ గ్రేడ్ ఉద్యోగులకు కూడా 2 రెట్ల నుంచి 3 రెట్లు జీతం పెరగొచ్చు. అలాగే, ఉన్నత స్థాయి ఉద్యోగులకు మాత్రం భారీ మొత్తంలో పెంపు ఉండొచ్చు. అధిక బాధ్యతలు ఉన్న ఉద్యోగులకు ఎక్కువ జీతం పెంపు ఉండొచ్చు.

రూ. 20వేలు ప్రాథమిక వేతనం పొందే లెవెల్ 1–5 ఉద్యోగి జీతం రూ. 58,400కి పెరగవచ్చు. రూ. 45వేల ప్రాథమిక వేతనం పొందే లెవెల్ 6-8 ఉద్యోగి జీతం రూ. 1.57 లక్షలకు పెరగవచ్చు.
రూ. 1.2 లక్షల ప్రాథమిక వేతనం పొందే లెవెల్ 13–16 ఉద్యోగి జీతం దాదాపు రూ. 4.91 లక్షలకు పెరగవచ్చు.

ఈ సిఫార్సులు ఆమోదిస్తారా? :
ఇది కేవలం ఉద్యోగ సంఘం ఇచ్చిన ప్రతిపాదన మాత్రమే. 8వ వేతన సంఘం ఇంకా అన్ని సంఘాలతో చర్చలు చేస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఈ కమిషన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంస్థలు, భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది.

చివరి నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. వాస్తవానికి ఉద్యోగ సంఘం ఇచ్చిన ఈ ప్రతిపాదన ఒకవేళ నిజమైతే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీమొత్తంలో పెరగనున్నాయి. కానీ, ఇదో అంచనా మాత్రమేనని గమనించాలి.