Car Hacking Alert : మీ కారు సేఫ్‌గానే ఉందా? ఈ ఒక్క చిన్న పొరపాటుతో హ్యాకర్ల చేతుల్లోకి.. సేఫ్టీ కోసం ఇలా..!
Car Hacking Alert : స్మార్ట్ కార్లను హ్యాకర్లు ఎలా టార్గెట్ చేస్తున్నారు? మొబైల్ యాప్‌లు, స్మార్ట్ కీలు, OBD పోర్టుల ద్వారా ఎదురయ్యే రిస్క్ ఏంటి? మీ కారును సేఫ్ గా ఉంచుకునే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- November 9, 2026 / 12:51 PM IST
Car Hacking Alert ( Image credit : AI )
- స్మార్ట్ కారుతో జాగ్రత్త.. మీ కారు ఎక్కడుందో హ్యాకర్లకు తెలుస్తుంది
- కారులో ఇంటర్నెట్ ఉందా? ఈ హ్యాకింగ్ రిస్క్ తప్పదు
- కారు దొంగతనానికి కొత్త టెక్నిక్.. స్మార్ట్ కీ ఉంటే మరింత జాగ్రత్త
Car Hacking Alert : స్మార్ట్ కారు కొంటున్నారా? జర జాగ్రత్త.. ఈ రోజుల్లో కారు అంటే కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు.. అదొక స్మార్ట్ డివైజ్.. ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ యాప్, జీపీఎస్, స్మార్ట్ కీ, వాయిస్ కమాండ్స్.. ఇలా ఎన్నో ఫీచర్లు కార్లలో ఉంటున్నాయి..
ఇంట్లో కూర్చొనే కారు డోర్లు అన్‌లాక్ చేయొచ్చు.. ఏసీ ఆన్ చేయొచ్చు.. ఇంజిన్ స్టార్ట్ చేయొచ్చు. వినడానికి బాగానే ఉన్నా.. ఇదే టెక్నాలజీ ఇప్పుడు కొత్త రిస్క్ తెచ్చిపెడుతోంది.. అవును.. మీరు చదివింది నిజమే.. మీ స్మార్ట్ కారును కూడా హ్యాకర్లు టార్గెట్ చేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కారును ఎలా హ్యాక్ చేస్తారు? :
కార్లలో ఉండే స్మార్ట్ ఫీచర్లు మొబైల్ యాప్‌లు, కంపెనీ సర్వర్లతో లింక్ అయి ఉంటాయి. ఇందులో సేఫ్టీ లోపాలు ఉంటే హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం, కారు లొకేషన్ వంటి వివరాలను దొంగిలించేందుకు ట్రై చేయొచ్చు.. అంతేకాదు, కారు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కలిపే వైరింగ్‌ను టార్గెట్ చేసుకోవడం, స్మార్ట్ కీ సిగ్నల్‌ను దొంగిలించడం వంటి మెథడ్స్ వాడొచ్చు..
Read Also : Top 5 Camera Smartphones : ఈ దీపావళికి అదిరిపోయే టాప్ 5 కెమెరా ఫోన్లు.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
‘రిలే అటాక్’తో జాగ్రత్త :
ముఖ్యంగా రిలే అటాక్ విషయంలో ప్రతి కారు ఓనర్ తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న స్మార్ట్ కీ సిగ్నల్‌ను స్పెషల్ డివైజ్ ద్వారా కారుకు రీచ్ అయ్యేలా చేసి కీ దగ్గర్లోనే ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇక డాష్‌బోర్డ్ కింద ఉండే OBD పోర్ట్‌ను దుర్వినియోగం చేసి కొత్త కీని ప్రోగ్రామ్ చేసే రిస్క్ కూడా ఉంటుంది.
అయితే, సినిమాలో చూపించినట్టు కదిలే కారులో స్టీరింగ్, బ్రేకులను ఎవరైనా ఈజీగా తమ కంట్రోల్లోకి తీసుకోవడం అంత ఈజీ కాదు. మోడ్రాన్ కార్లలో ప్రత్యేక సేఫ్టీ సిస్టమ్ ఉంటాయి. అయినప్పటికీ కారు దొంగతనం, పర్సనల్ డేటా చోరీ, అన్ నౌన్ ఎంట్రీ వంటి రిస్క్ విషయంలో అసలు తక్కువగా అంచనా వేయకూడదు..
కారు సేఫ్టీ కోసం ఈ సేఫ్టీ మస్ట్ :
స్మార్ట్ కీని ఫారడే పౌచ్‌లో ఉంచండి. కారుకు స్టీరింగ్ లాక్ సెట్ చేయండి. OBD పోర్టుకు సేఫ్టీ లాక్ వాడండి. మొబైల్ యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టండి. గుర్తు తెలియని యాక్సెసరీలను కారుకు కనెక్ట్ చేయకండి. కంపెనీ రిలీజ్ చేసే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేయండి. కారు ఎంత స్మార్ట్‌గా ఉంటే, దాని సేఫ్టీ విషయంలో అంత అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే ఈ స్మార్ట్ కారు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం..
