Car Insurance : వరదల్లో కారు దెబ్బతింటే వెంటనే ఇలా చేయండి.. బీమా క్లెయిమ్ ప్రాసెస్, కవరేజ్ వివరాలివే!

Car Insurance : వరదల్లో మీ కారు దెబ్బతింటే ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది? పాలసీ నిబంధనలేంటో తప్పక తెలుసుకోండి..

Car Insurance

  • తుఫానులో కారుకు నష్టం కలిగితే బీమా వర్తిస్తుందా?
  • ఎలాంటి బీమా తీసుకోవాలి? ఏది తీసుకోకూడదు
  • కారు దెబ్బతింటే బీమా పరిహారం చెల్లిస్తుందా? లేదా?

Car Insurance : అసలే వర్షాకాలం.. వర్షాలు మొదలయ్యాయి.. సాధారణంగా వర్షాకాలం సీజన్‌లో తీవ్రమైన గాలులతో తుఫాను, హారికేన్ లేదా చెట్లు కూలడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో రోడ్ల పక్కన నిలిపిన వాహనాలు దెబ్బతింటాయి.

ఒకవేళ మీ కారుకు ఏదైనా పాలసీ ఉండి ఉంటే ఆ నష్టానికి బీమా సంస్థ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ మీ కారుకు జరిగిన నష్టానికి క్లెయిమ్ అనేది మీ ఇన్సూరెన్స్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

తీవ్రమైన గాలులు, వర్షం, తుఫాను సమయంలో చెట్ల కొమ్మలు, రేకులు గాల్లో ఎగిరి (Car Insurance) వాహనాలపై పడుతుంటాయి. అప్పుడు కారు హుడ్స్, రూఫ్‌లు లేదా విండ్‌షీల్డ్‌లు భారీగా దెబ్బతింటాయి. ఈ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుందా? లేదా? ఆ ఖర్చును భీమా సంస్థే భరించాలంటే ఏం చేయాలి? ఎలాంటి నిబంధనలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి మాత్రమే కారుకు జరిగిన పూర్తి నష్టాన్ని కవర్ చేస్తుంది. అయితే, థర్డ్-పార్టీ పాలసీలు మాత్రం కవర్ చేయవు. కారుకు నష్టం జరిగిన వెంటనే ఆయా ప్రాంతం, ఫొటోలు తీయండి.

ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి. ఒక సర్వేయర్ వచ్చి పరిస్థితిని చెక్ చేస్తారు. అప్పటివరకూ దెబ్బతిన్న కారుకు ఎలాంటి రిపేర్లు చేయించొద్దు. ఎందుకంటే.. మీ క్లెయిమ్‌ వెంటనే రిజెక్ట్ అవుతుంది జాగ్రత్త..

క్లెయిమ్ అవుతుందా? లేదో చెక్ చేయండి :
మీ కారు నష్టానికి అందే పరిహారం మీ బీమా పాలసీపైనే ఆధారపడి ఉంటుంది. మీకు కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ ఉంటేనే తుఫానులు, హరికేన్‌లు, వర్షం, చెట్లు కూలిపోవడం లేదా వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం కవర్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో కారు పగిలిన అద్దాలు లేదా బాడీ డ్యామేజ్ కోసం క్లెయిమ్‌లు చేయొచ్చు.

Read Also : Vivo V70 Lite Launch : కొత్త వివో ఫోన్ సెన్సేషన్ .. వివో V70 లైట్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్..

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉందా? :
మీ దగ్గర థర్డ్-పార్టీ పాలసీ మాత్రమే ఉందా? మీ కారుకు జరిగిన నష్టానికి మీ బీమా కంపెనీ చెల్లించదు. ఈ పాలసీ కేవలం మరో వ్యక్తికి, వాహనానికి లేదా ఆస్తికి జరిగిన నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.

వాహన నష్టం జరిగితే ఏం చేయాలి? :
తుఫాను ప్రభావిత ప్రాంతాలన్నింటినీ ఫొటోలు తీయాలి. క్లియర్ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసి దగ్గర పెట్టుకోండి. వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి.

హెల్ప్‌లైన్, మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. పాలసీ నంబర్, వాహన పత్రాలు, వాహన నష్టం ఫొటోలను రెడీగా పెట్టుకోండి.

సర్వేయర్ కోసం వెయిట్ చేయండి :
కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీ చెకింగ్ కోసం ఒక సర్వేయర్‌ను పంపుతుంది. నష్టం జరిగిన వెంటనే అద్దాలను మార్చొద్దు. ఆ తర్వాత క్లెయిమ్ దాఖలు చేయొద్దు.

చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుగా వాహన చెకింగ్ అనేది తప్పనిసరి చేశాయి. ఇన్సూరెన్స్ కంపెనీల అనుమతి లేకుండా రిపేర్లు చేయొద్దు. అలా చేస్తే మీ క్లెయిమ్ వెంటనే రిజెక్ట్ అవుతుంది.

ఇవి తప్పక గుర్తుంచుకోండి :

  • ముందుగా పాలసీ నిబంధనలను చదవండి.
  • కొన్ని పాలసీ ప్లాన్‌లలో మినహాయింపు వర్తిస్తుంది.
  • త్వరగా క్లెయిమ్ దాఖలు చేయండి.
  • అన్ని రసీదులు, ఫొటోలను జాగ్రత్తగా దాచుకోండి.