Motor Vehicle Rules : వాహనదారులకు బిగ్ అప్డేట్.. 100శాతం ఇథనాల్‌తో నడిచే కార్లకు కొత్త రూల్స్..!
Motor Vehicle Rules : E100 ఇంధనానికి కేంద్రం గుర్తింపు కల్పిస్తూ మోటారు వాహన నిబంధనల్లో మార్పులు చేసింది. E20 కార్లపై ప్రభావం, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ప్రత్యేకతలు, ఇథనాల్ ఇంధన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- October 26, 2026 / 08:33 PM IST
Motor Vehicle Rules
- పెట్రోల్ కార్లకు కొత్త పవర్.. E100 ఇంధనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
- E100తో దూసుకెళ్లే కార్లు.. E20 వాహనాలకు మాత్రం పాత రూల్సే
- పెట్రోల్ దిగుమతులకు చెక్ పెట్టే దిశగా భారత్.. ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లకు ప్రోత్సాహం
Motor Vehicle Rules : పెట్రోల్ ధరలు, ఇంధన దిగుమతుల భారం మధ్య వాహనదారులకు ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు సంబంధించి కీలక ముందడుగు వేసింది.
E100 ఇంధనాన్ని ఉపయోగించేలా ప్రత్యేకంగా రూపొందించి, ధ్రువీకరించిన వాహనాలకు గుర్తింపు కల్పిస్తూ మోటారు వాహన నిబంధనల్లో మార్పులు చేసింది. అక్టోబర్ 23న ఈ సవరణలను నోటిఫై చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
E100 ఏంటి? :
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే.. ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు భిన్నంగా ఉంటాయి. E20లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. E85లో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటాయి. ఇక E100లో దాదాపు పూర్తిగా ఇథనాల్ ఉంటుంది.
Read Also : Dhanush Political Entry : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ.. వెండి దీపాలపై కమలం గుర్తుతో కొత్త రచ్చ!
అయితే, ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. E100కు అనుమతి వచ్చిందని ప్రతి పెట్రోల్ కారులో ఈ ఇంధనాన్ని నింపకూడదు. అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారుచేసి ధ్రువీకరించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మాత్రమే E85, E100ను వాడాలి..
E20 కార్లకు నో ఛేంజ్ :
ఇప్పటికే E20 పెట్రోల్‌కు అనుగుణంగా నడుస్తున్న వాహనాల విషయంలో ఈ సవరణతో కొత్తగా ఇంధన అనుమతి లభించదు. సాధారణ పెట్రోల్ లేదా E20 కోసం రూపొందించిన కార్లలో E85, E100 వాడటం కుదరదు.. కారు తయారీదారు సూచనలు, వాహనం ధ్రువీకరణ వివరాలే ఇక్కడ కీలకం.
కొత్త నిబంధనల్లో భాగంగా కొన్ని వాహన వర్గీకరణలు, సాంకేతిక ప్రమాణాల్లోనూ మార్పులు చేశారు. సంబంధిత లైట్ పెట్రోల్, డీజిల్ వాహనాలకు బరువు పరిమితిని 3వేల కిలోల నుంచి 3,500 కిలోలకు పెంచారు.
ఇంధన రంగంలో కొత్త మార్పులకు నాంది? :
భారత్‌లో ఇథనాల్ ఆధారిత ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. మారుతి సుజుకి, టయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి.
