Cheapest Car Loans : కారు లోన్ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీతో కారు లోన్లు ఇచ్చే బ్యాంకులివే.. ఫుల్ డిటెయిల్స్
Cheapest Car Loans : కారు లోన్ కావాలా? మార్చి 2026లో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు తక్కు వడ్డీ రేటుతో కారు లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published On : March 14, 2026 / 03:44 PM IST
Cheapest Car Loans
- మార్చి 2026లో చౌకైన కార్లు లోన్లు ఇచ్చే బ్యాంకులు
- తక్కువ వడ్డీ రేట్లతో కారు లోన్లు అందించే ప్రైవేటు బ్యాంకులు
- ఏయే బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Cheapest Car Loans : కొత్త కారు కొంటున్నారా? ఏదైనా బ్యాంకులో కారు లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ల కోసం తక్కువ వడ్డీ రేటుకే కారు రుణాలను అందిస్తున్నాయి.
వడ్డీ రేట్లు బ్యాంకులు బట్టి మారుతూ ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకు నుంచి కారు లోన్ తీసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీరు ప్రైవేట్ బ్యాంకు నుంచి కారు లోన్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
HDFC బ్యాంక్ కారు లోన్ వడ్డీ రేటు :
అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్ కస్టమర్లకు 9 శాతం నుంచి కారు లోన్లను అందిస్తుంది. కస్టమర్ క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ కారు లోన్ వడ్డీ రేటు :
ప్రైవేట్ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు 8.5 శాతం నుంచి కారు లోన్లను అందిస్తుంది. కస్టమర్ క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేటు :
ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు 8.95 శాతం నుంచి వడ్డీ రేట్లతో కారు లోన్లను అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా కస్టమర్ క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి మారుతూ ఉంటాయి.
బంధన్ బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేటు :
బంధన్ బ్యాంక్ తమ కస్టమర్లకు 9.47 శాతం నుంచి కారు లోన్లను అందిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
ఐడీబీఐ బ్యాంక్ కారు లోన్ వడ్డీ రేటు :
ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు 7.50 శాతం నుంచి కారు రుణాలను అందిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాలను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
