Credit Card Rules : క్రెడిట్ కార్డు కొత్త రూల్స్.. ఇకపై పూర్తి బిల్లు కట్టకపోతే ఖతమే.. ఈ బ్యాంకు యూజర్లకు కష్టాలు తప్పవు!
Credit Card Rules: ఇండస్‌ఇండ్ బ్యాంక్ జూన్ 15 నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది. మినిమం అమౌంట్ కడితే భారీ వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఆలస్య రుసుములపై ఛార్జీలు కూడా పెరిగాయి.
- Sreehari A
- Published on- June 16, 2026 / 09:31 PM IST
Credit Card Rules
- జూన్ 15 నుంచి ఇండస్‌ఇండ్ బ్యాంక్ కొత్త రూల్స్
- క్రెడిట్ కార్డులకు సంబంధించి 5 కీలక మార్పులు
- అదనపు ఛార్జీలు, జీఎస్టీ, ఆలస్య రుసుములపై ఛార్జీలు
Credit Card Rules: క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్.. మీకు ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. ఇప్పటినుంచి మీ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. జూన్ 15 నుంచి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది.
మినిమం డ్యూ పేమెంట్స్, ఆలస్య చెల్లింపు ఛార్జీలు, షాపింగ్ బిల్లులు వంటి క్రెడిట్ కార్డులకు (Credit Card Rules) సంబంధించి 5 నిబంధనలను మార్చేసింది. ఈ మార్పులతో క్రెడిట్ కార్డు వాడే యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మినిమం డ్యూ చెల్లిస్తే భారీ నష్టం :
ఫుల్ బిల్లు కాకుండా క్రెడిట్ కార్డుపై మినిమం డ్యూ మొత్తాన్ని చెల్లించవద్దు. కొత్త నిబంధనల ప్రకారం.. ఫుల్ బిల్లు పేమెంట్ చేయకపోతే మిగిలిన బ్యాలెన్స్‌పై భారీ వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. వరుసగా 2 నెలల పాటు (స్టేట్ మెంట్ సైకిల్స్) మొత్తం బిల్లును సకాలంలో చెల్లించేంతవరకు మీకు వడ్డీ మినహాయింపు ఉండదు.
2. ఆలస్య రుసుముల పెంపు :
మీ క్రెడిట్ కార్డ్ బిల్లును గడువు తేదీలోగా చెల్లించకపోతే ఇకపై గతంలో కన్నా ఎక్కువ మొత్తంలో పెనాల్టీ చెల్లించాలి. బ్యాంక్ ఆలస్య రుసుము రూ. 501 నుంచి రూ. 1,000 మధ్య బ్యాలెన్స్‌లకు ఇప్పుడు రూ. 350కి బదులుగా రూ. 500 ఖర్చవుతుంది.
రూ. 5వేల నుంచి రూ. 10వేల మధ్య బ్యాలెన్స్‌లకు ఇప్పుడు రూ. 550 నుంచి రూ. 750 ఖర్చవుతుంది. ఈ పెరిగిన ఆలస్య రుసుము క్లబ్ విస్తారా, ఎక్స్‌ప్లోరర్, పయనీర్ ప్రైవేట్, పయనీర్ హెరిటేజ్ వంటి బ్యాంకులు కొన్ని ప్రీమియం కార్డులకు వర్తించదు.
3. పెట్రోల్, డీజిల్‌పై లిమిట్ తగ్గింపు :
మీ క్రెడిట్ కార్డుతో పెద్ద మొత్తంలో పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తే బ్యాంకు అలాంటి పేమెంట్లపై పరిమితిని తగ్గించింది. గతంలో, నెలకు రూ. 50వేల కన్నా ఎక్కువ ఇంధనం కొంటే అదనపు ఛార్జీ పడేది. ఇప్పుడు, ఈ లిమిట్ రూ. 30వేలకు తగ్గించారు. నెలకు రూ. 30వేల కన్నా ఎక్కువ ఇంధనం కొంటే ఒక శాతం అదనపు రుసుము, జీఎస్టీ వర్తిస్తాయి.
4. ప్రయాణ, రవాణా రంగాలపై ఎఫెక్ట్ :
క్యాబ్‌లు ఓలా, ఉబెర్, బస్సు, రైలు టిక్కెట్లు బుకింగ్ లేదా టోల్ పన్నులు చెల్లించేందుకు క్రెడిట్ కార్డులను వాడేవారిపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ ట్రాన్స్ ఫోర్ట్ సేవలపై నెలకు రూ. 40వేల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే.. ఇకపై ఒక శాతం అదనపు ఛార్జీతో జీఎస్టీ కూడా పడుతుంది.
5. ఫారెన్ సైట్లలో షాపింగ్ కాస్ట్‌లీ :
ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ లేదా మర్చంట్ నుంచి కొనుగోలు చేస్తే.. బిల్లు డాలర్లలో కాకుండా నేరుగా రూపాయిలో ఉంటే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీ వర్తిస్తుంది. బ్యాంక్ ఈ ఛార్జీని స్టాండర్డ్ కార్డ్‌లు, టైగర్ కార్డ్‌ల కోసం 1 శాతం నుంచి 2 శాతానికి (అదనంగా జీఎస్టీ) పెంచింది. అంతర్జాతీయ లావాదేవీలు ఇప్పుడు గతంలో కన్నా చాలా ఖరీదు అనమాట.
