Dawood Ibrahim : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎట్టకేలకు అమ్ముడైన ప్లాట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?
Dawood Ibrahim : మోస్ట్ వాంటెడ్ నిందితుడైన దావూద్ ఇబ్రహీంకు చెందిన భూములు ఎట్టకేలకు అమ్ముడయ్యాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని వ్యవసాయ భూములకు చివరకు కొనుగోలుదారు లభించారు.
- Sreehari A
- Published On : March 19, 2026 / 07:36 PM IST
Dawood Ibrahim
- దావూద్ ఇబ్రహీం రత్నగిరి వ్యవసాయ భూముల అమ్మకం
- 2026 మార్చి 5న జరిగిన భారీ వేలం
- ముంబైకి చెందిన వ్యక్తి 4 ప్లాట్లు కొనేశాడు
- ముంబై బాంబు దాడుల కేసులో దావూద్ ప్రధాన నిందితుడు
Dawood Ibrahim : భారత్‌లో అత్యంత వాంటెడ్ పరారీ దావూద్ ఇబ్రహీం.. ఎవరికైనా ఇతడి పేరు విన్నా వెన్నులో వణుకుపుడుతుంది. ఇప్పుడు అతని ఒక సీక్రెట్ పూర్వీకుల భూములకు వేలంలో ఉన్నాయి. దావూద్‌కు చెందిన భూమికి ఎట్టకేలకు కొనేవాళ్లు దొరికారు.
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న అతని పూర్వీకుల వ్యవసాయ భూములను కొనేందుకు ముందుకు వచ్చారు. 2026 మార్చి 5న భారీ వేలం జరిగింది. అక్కడే ముంబైలోని ఒక వ్యక్తి దావూద్ భూములను కొనేందుకు ముందుకు వచ్చాడు. మొత్తం 4 ప్లాట్లకూ అతి పెద్ద బిడ్డు వేసి మరి దక్కించుకున్నాడు.
దావూద్ ఆస్తుల స్వాధీనం :
ఈ భూములు రత్నగిరి జిల్లాలోని ఖేడ్ తాలూకాలో ఉన్న ముంబాకే గ్రామంలో ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం పూర్వీకుల గ్రామంగా పరిగణిస్తారు. ఈ భూములలో చాలా వరకు గతంలో అతడి తల్లి అమీనా బీ పేరు మీద నమోదై ఉన్నాయని చెబుతారు. ప్రభుత్వం ఈ ఆస్తులను స్మగ్లర్లు, విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల చట్టం (SAFEMA) కింద స్వాధీనం చేసుకుని వేలానికి ఉంచింది.
ఈ వేలంలో 4 ప్లాట్లను ఒకే కొనుగోలుదారుడు దక్కించుకున్నారు. అతిపెద్ద ప్లాట్ (సర్వే నంబర్ 442) రూ. 10 లక్షలకు పైగా అమ్ముడుపోగా, మిగిలిన 3 ప్లాట్లు వేర్వేరు ధరలకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు, కొనుగోలుదారుడు 2026 ఏప్రిల్ ప్రారంభం నాటికి పూర్తి మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఆ తర్వాతే పూర్తిగా ఆయన సొంతం అవుతుంది.
గతంలో అనేకసార్లు వేలం పాటలు :
దావూద్ భూములను వేలం వేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా వీటిని అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. 2017, 2020, 2024, 2025 సంవత్సరాలలో వేలంపాటలు జరిగాయి.
కానీ, కొనుగోలుదారులు ముందుకు రాలేదు. ఒకవేళ వేలంపాట వరకు వచ్చినా ధరను అందుకోలేకపోయాయి. దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధం కారణంగా ప్రజలు తరచుగా ఈ ఆస్తులను కొనేందుకు ఇష్టపడటం లేదు.
దావూద్ ఆస్తులు కొనేసిన ఢిల్లీ లాయర్ :
ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాస్తవ ఈ వేలంపాట సమయంలో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. ఆయన గతంలో దావూద్‌తో సంబంధం ఉన్న ఆస్తులను కొనుగోలు చేశారు. కానీ, చాలా సందర్భాలలో చెల్లింపులు జరగక ఆగిపోయాయి. చట్టపరమైన వివాదాల కారణంగా ఆ ఒప్పందాలు పూర్తి కాలేదు.
భారత్‌లో దావూద్ ఇబ్రహీం అత్యంత వాంటెడ్ క్రిమినల్. 1993లో 250 మందికి పైగా మరణించిన ముంబై బాంబు దాడుల కేసులో ప్రధాన నిందితుడు. పాకిస్థాన్‌లో దాక్కున్నాడని భారత ఏజెన్సీలు భావిస్తున్నాయి.
