Decathlon Electric Road Bike : వారెవ్వా.. సూపర్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా? 100కి.మీ రేంజ్‌తో కొత్త డెకాథ్లాన్.. ధర తెలిస్తే షాకే..!

Decathlon Electric Road Bike : ఈ బైక్‌లో బ్లూటూత్ ANT+ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో SRAM అపెక్స్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు అమర్చి ఉన్నాయి. పూర్తి వివరాలివే..

Decathlon Electric Road Bike

  • SRAM అపెక్స్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు
  • మహ్లే మోటార్, కార్బన్ ఫోర్క్, టైర్లు 32mm వెడల్పు
  • డెకాథ్లాన్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 267,000 మాత్రమే

Decathlon Electric Road Bike : డెకాథ్లాన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్‌ను వాన్ రైసెల్ (E-EDR AF SRAM) అపెక్స్ అనే పేరుతో లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 12 స్పీడ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లో వైర్‌లెస్ డెరేలర్ ఉంది. ఇందులో మహ్లే మోటార్ కూడా ఉంది.

ఈ బైక్‌లో బ్లూటూత్ ANT+ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. SRAM అపెక్స్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు (Decathlon Electric Road Bike) అమర్చారు. కార్బన్ ఫోర్క్ 32mm వెడల్పు టైర్లు ఉన్నాయి. ఈ కొత్త మోడల్ బరువు తక్కువగా ఉంటుంది. మెయింట్ నెన్స్ కూడా చాలా తక్కువ ఖర్చు ఉంటుందని కంపెనీ చెబుతోంది. ధర ఇతర ఫీచర్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ధర ఎంతంటే? :
డెకాథ్లాన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్, వాన్ రైసెల్ ఇ-ఇడీఆర్ ఎఎఫ్ ఎస్ఆర్ఎఎం అపెక్స్‌ను యూరోపియన్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర (సుమారు రూ. 267,000) ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ఎలక్ట్రిక్ బైకు కొనుగోలు చేయవచ్చు.

Read Also : Motorola G77 Power : అద్భుతం.. ఈ మోటోరోలా ఫోన్ మరి తక్కువా? ధర ఎంతో తెలిస్తే కొనుకుండా ఉండలేరు!

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
డెకాథ్లాన్ కొత్త బైక్ 12 స్పీడ్‌లతో వస్తుంది. వైర్‌లెస్ SRAM అపెక్స్ XPLR డెరేలర్. ఈ కొత్త మోడల్ బరువు తక్కువగా ఉంటుంది. మెయింట్‌నెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇందులో కొత్త మహలే పల్సర్ వన్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లేలో బ్యాటరీ ఛార్జింగ్ లెవల్, మిగిలిన బ్యాటరీ, రేంజ్ వంటి సమాచారం కనిపిస్తుంది.

అసిస్టెన్స్ లెవల్ కూడా ఇందులో కనిపిస్తుంది. కంట్రోలింగ్ పూర్తి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ బైక్‌లో 160mm బ్రేకులు ఉన్నాయి. ఫ్రేమ్ అల్యూమినియంతో తయారైంది. మిడ్ వెయిట్ సైజులో వస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు కేవలం 14 కేజీలు మాత్రమే.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో బ్లూటూత్ ANT+ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 250W 40Nm మహ్లే మోటార్‌తో రన్ అవుతుంది. 250Wh బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 100 కి.మీ రేంజ్‌ అందిస్తుంది. ఎక్స్‌టెండర్‌తో 160 కి.మీ.ల వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో SRAM అపెక్స్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు, కార్బన్ ఫోర్క్ 32mm వెడల్పు టైర్లు ఉన్నాయి.