Term Insurance : విదేశాల్లో మరణిస్తే భారత్‌లో ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందా? ప్రతి NRI తప్పక తెలుసుకోండి..!

Term Insurance : టర్మ్ పాలసీ తీసుకున్నాక విదేశాలకు వెళ్లి అక్కడే మరణిస్తే అప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా? రావా? టర్మ్ పాలసీ రూల్స్ ఏంటి? ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Term Insurance

  • NRIలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి చెక్ చేయండి
  • దేశం దాటినా భరోసా మారదు ఏ దేశంలో ఉన్నా టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సాధ్యమేనా?
  • విదేశాల్లో చనిపోయినా భారత్‌లో ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందా? రూల్స్ ఏంటి?

Term Insurance : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం.. అందులోనూ దేశం కానీ దేశం వెళ్లిన వారికి టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దురదృష్టవశాత్తూ విదేశాల్లో మరణిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బు వారి కుటుంబానికి అందుతుంది. వారు లేకున్నా ఆ ఫ్యామిలీకి డబ్బు అండగా నిలుస్తుంది.

అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలని అంటుంటారు. అదే మీరు (Term Insurance) ఎన్ఆర్‌ఐలైతే ఇంకా మంచిది.. వాస్తవానికి, ఒకప్పుడు ఉద్యోగం కోసమే విదేశాలకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు లక్షలాది మంది భారతీయులు యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్తున్నారు.

అక్కడే ఉంటున్నారు. అక్కడే చదువుకుంటున్నారు.. కానీ, వాళ్లు ఎక్కడ ఉన్నా మనసు మాత్రం తమ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. “నేను విదేశాల్లో ఉండగా నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి నా టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బు అందుతుందా? లేదా? ఇది ప్రతి NRI పాలసీదారుడి మనసులో వచ్చే సందేహమే.. ఒక్కమాటలో సమాధానం చెప్పాలంటే.. అవును.. పాలసీ డబ్బు అందుతుంది..

Read Also : Viral Video : ఆస్పత్రిలో బెడ్‌పై భర్త.. పక్కనే భార్య రీల్స్ చేస్తూ డ్యాన్స్.. పొట్టుపొట్టు తిడుతున్న జనం..!

మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వ్యాలీడ్ అయి ఉండాలి. ప్రీమియంలు సమయానికి చెల్లిస్తూ ఉండి ఉండాలి. పాలసీ నిబంధనలను పాటించాలి. అప్పుడు మీరు విదేశాల్లో ఉన్నా అక్కడే మరణించినా మీ ఫ్యామిలీకి మాత్రం బీమా రక్షణ ఉంటుంది. ఎందుకంటే.. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక దేశానికి ప్రాంతానికి సంబంధించింది కాదు. మీ కుటుంబ భవిష్యత్తుకు ఇచ్చే ఒక భద్రతా హామీ.

విదేశాల్లో మరణిస్తే క్లెయిమ్ ఎలా? :
మీరు విదేశాల్లో ఉండగా మరణిస్తే మీ నామినీ బీమా సంస్థను సంప్రదించి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.

క్లెయిమ్ పొందాలంటే?

  • మీ పాలసీ యాక్టివ్‌గా ఉండాలి.
  •  మరణం పాలసీ కవరేజ్ పరిధిలో ఉండాలి.
  •  అవసరమైన పత్రాలను సమర్పించాలి.

ఫ్యామిలీ రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు ఇవే :
విదేశాల్లో మరణ క్లెయిమ్ సమయంలో సాధారణంగా అవసరమయ్యే డాక్యుమెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • క్లెయిమ్ ఫారమ్
  • పాలసీ వివరాలు
  •  ఫారెన్ కంట్రీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం
  • అవసరమైతే భారత రాయబార కార్యాలయం ధ్రువీకరణ
  • పాస్‌పోర్ట్ కాపీలు
  • మెడికల్ రిపోర్టులు (ఉంటే)
  • ప్రమాద మరణమైతే పోలీస్ రిపోర్ట్
  • నామినీ బ్యాంక్ వివరాలు

క్లెయిమ్ డబ్బు ఎలా అందుతుంది? :
బీమా సంస్థ మీ డాక్యుమెంట్లన్నీ పరిశీలించాక క్లెయిమ్ అప్రూవల్ అయితే.. సాధారణంగా బీమా మొత్తం భారతీయ కరెన్సీలో నామినీ బ్యాంక్ ఖాతాకు చెల్లిస్తారు. విదేశాల్లో ఉన్న ఫ్యామిలీ సభ్యులు కూడా సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు.

ఏయే పరిస్థితుల్లో క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది? :
కొన్ని సందర్భాల్లో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  •  ప్రీమియంలు కట్టక పాలసీ ల్యాప్స్ అయితే..
  • పాలసీలో సూచించిన మినహాయింపు పరిస్థితుల్లో మరణం సంభిస్తే
  • పాలసీ తీసుకునే సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని రుజువైతే..

NRI పాలసీదారులు టిప్స్ గుర్తుంచుకోండి :

  •  మీ ప్రీమియంలను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించండి.
  •  విదేశీ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ మారితే బీమా సంస్థకు వెంటనే చెప్పండి.
  •  నామినీ వివరాలను ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంచండి.
  •  పాలసీ పత్రాల వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయండి.
  •  అత్యవసర సమయంలో క్లెయిమ్ ఎలా చేయాలో కూడా ముందుగానే చెప్పండి.

ప్రతిఒక్కరి జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. అందుకే ముందుగానే కుటుంబ భద్రతను ఆలోచించి టర్మ్ పాలీసీని తీసుకోవడం ఎంతైనా మంచిది. మీరు లేని లోటు పాలసీ తీరుస్తుంది అనమాట.. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం పాలసీ కాదు.. మనం దూరంగా ఉన్నా లేకున్నా మన కుటుంబానికి ఆర్థిక భరోసాను అందిస్తుంది.. మీరు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుంటే ఇప్పుడే తీసుకోండి..