×
Ad

East India Company : బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి దివాలా వరకు.. ఈస్ట్ ఇండియా కంపెనీ షాకింగ్ స్టోరీ, నడిపింది మన భారతీయుడే!

East India Company : ఈస్ట్ ఇండియా కంపెనీ రెండోసారి మూతపడింది. 2000లో భారత వ్యవస్థాపకుడు సంజీవ్ మెహతా ద్వారా మేఫెయిర్ లగ్జరీ బ్రాండ్‌గా తిరిగి ప్రారంభమైంది. హై-ఎండ్ టీలు, రుచికరమైన ఆహార పదార్థాలను విక్రయించింది. సుమారు రూ. 11.7 కోట్ల వరకు అప్పులు పాలై ఇప్పుడు మళ్లీ మూతపడింది.

  • Published On : February 26, 2026 / 08:00 PM IST

East India Company

  • 170 ఏళ్ల తర్వాత రెండోసారి మూతపడ్డ ఈస్ట్ ఇండియా కంపెనీ
  • 2010లో వ్యాపారవేత్త సంజీవ్ మెహతాకు చేతుల్లోకి వెళ్లంది
  • సుమారు రూ. 11.7 కోట్ల వరకు అప్పులు పాలై మళ్లీ మూతపడింది
  • 1600లో క్వీన్ ఎలిజబెత్ I రాయల్ చార్టర్ ఈ కంపెనీని స్థాపించాడు

East India Company : ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్లీ దివాలా తీసింది. 170 ఏళ్ల తర్వాత మళ్లీ మూతపడింది. ఈ కంపెనీ ముందు టూలెట్ బోర్డు వేలాడుతోంది. ఒకప్పుడు భారత్‌ను పాలించిన ఈ బ్రిటిష్ వాణిజ్య సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈసారి లండన్ లో లగ్జరీ రిటైలర్ బిజినెస్ దివాలా తీయడంతో మూతపడింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు 170 ఏళ్ల క్రితం 1874లో మూతపడింది. అయితే, 2010లో భారత సంతతికి చెందిన బ్రిటిష్ వ్యాపారవేత్త సంజీవ్ మెహతా ఆ పేరు హక్కులను కొనుగోలు చేశాడు. తద్వారా ఆ కంపెనీకి అన్ని తానై నడిపించాడు. అప్పటి నుంచి లండన్‌లో లగ్జరీ రిటైలర్‌గా నడుస్తోంది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాజెక్ట్ ఇప్పుడు ముగిసింది.

1857 నాటి సిపాయి తిరుగుబాటు తర్వాత భారత్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1858లో బ్రిటిష్ క్రౌన్ నియంత్రణలో వెళ్లింది. 2010లో వ్యాపారవేత్త సంజీవ్ మెహతా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు హక్కులను కొనుగోలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

ది సండే టైమ్స్‌లోని నివేదిక ప్రకారం.. ఈస్ట్ ఇండియా కంపెనీ లిమిటెడ్ అక్టోబర్ 2025లో లిక్విడేటర్లను నియమించింది. కంపెనీ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టర్ చేసుకున్న పేరంట్ కంపెనీకి 600,000 పౌండ్లు (రూ. 6.3 కోట్లు), పన్నుల రూపంలో 193,789 పౌండ్లు (రూ. 2.03 కోట్లు), ఉద్యోగులకు 163,105 పౌండ్లు (రూ. 1.71 కోట్లు) కన్నా ఎక్కువ బకాయిపడింది. మొత్తంగా సుమారు రూ. 11.7 కోట్ల వరకు అప్పులు పాలై ఇప్పుడు మళ్లీ మూతపడింది.

సంజీవ్ మెహతాకు సంబంధించిన ఈస్ట్ ఇండియా పేరుతో అనేక ఇతర కంపెనీలు కూడా మూతపడ్డాయి. ఆ కంపెనీ వెబ్‌సైట్ కూడా ఇప్పుడు డౌన్ అయింది. లండన్‌లోని మేఫెయిర్‌లోని 97 న్యూ బాండ్ స్ట్రీట్‌లోని స్టోర్ కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు అక్కడ టూలెట్ బోర్డు పెట్టేశారు.

Read Also : BANK FD Rates : FD పెట్టుబడిదారులకు పండగే.. SBI, PNB, BoB, ఇండియన్ బ్యాంక్ 444 రోజుల FD రేట్లు, ఏ బ్యాంకులో రాబడి ఎంతంటే?

ఈస్ట్ ఇండియా కంపెనీ పగ్గాలు చేపట్టిన సంజీవ్ మెహతా :

2000 ప్రారంభంలో సంజీవ్ మెహతా వాటాదారుల నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరును చేజిక్కించుకున్నారు. హోల్‌సేల్ వ్యాపారంగా పునరుద్ధరించాలని ప్రయత్నించాడు. 2010లో ఆయన మేఫెయిర్‌లో 2,000 చదరపు అడుగుల లగ్జరీ స్టోర్‌ను కూడా ప్రారంభించాడు. హైక్వాలిటీతో టీలు, చాక్లెట్లు, మిఠాయిలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను అమ్మాడు.

వలసవాద కంపెనీ పట్ల సానుకూలత ఏర్పడిందని మెహతా పేర్కొన్నారు. 2017లో ది గార్డియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక భారతీయుడు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని నడపడం ప్రతికూలత సానుకూలంగా మారిందని అర్థం’’ అని తెలిపారు.

1800 ప్రారంభంలో ఈ కంపెనీకి దాదాపు 2 లక్షల 50వేల మందితో కూడిన ప్రైవేట్ సైన్యం ఉంది. అప్పటి బ్రిటిష్ సైన్యం కన్నా రెండింతలు పెద్దది. భారత్‌లో విస్తారమైన ప్రాంతాలను తన అధీనంలో ఉంచుకుంది. సుగంధ ద్రవ్యాలు, పత్తి, పట్టు, టీ, ఇండిగో, మరిన్నింటిలో ప్రపంచ వాణిజ్యాన్ని నడిపించింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ హిస్టరీ ఏంటి? :

డిసెంబర్ 31, 1600న క్వీన్ ఎలిజబెత్ I నుంచి రాయల్ చార్టర్ స్థాపించిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది. భారత్, ఆగ్నేయాసియాతో సహా ఈస్ట్ ఇండీస్ నుంచి సుగంధ ద్రవ్యాలు, వస్తువుల కోసం పోటీ పడేందుకు జాయింట్-స్టాక్ ట్రేడింగ్ సంస్థగా ప్రారంభమైంది.

ప్రపంచంలోని మొట్టమొదటి జాయింట్-స్టాక్ కంపెనీలలో ఇదొకటి. ఇక్కడ పెట్టుబడిదారులు వాటాలను కొనుగోలు చేసి లాభాలు, నష్టాలను పంచుకున్నారు. ఈ కంపెనీ 1612-1613లో భారత్ సూరత్‌లో మొదటి ట్రేడింగ్ పోస్ట్‌ను ఏర్పాటు చేసింది. కాలక్రమేణా, కేప్ ఆఫ్ గుడ్ హోప్‌కు తూర్పున బ్రిటిష్ వాణిజ్యంపై గుత్తాధిపత్య హక్కులను పొందింది.

1700 నాటికి ప్రధాన శక్తిగా ఎదిగింది. కోటలు నిర్మించడంతో పాటు స్థానిక పాలకులతో పొత్తులు పెట్టుకుంది. ఫ్రెంచ్, స్థానిక రాజ్యాల వంటి ప్రత్యర్థులపై యుద్ధాలు చేసింది. 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత పన్నులు వసూలు చేయడం, కోర్టులను నడపడం, బెంగాల్ వంటి ప్రాంతాలను పరిపాలించింది. కొన్ని వస్తువులలో ప్రపంచ వాణిజ్యంలో సగం వాటాను పొందింది.

భారత్ లో దాదాపు ఒక ప్రభుత్వంలా వ్యవహరించింది. అది క్రమంగా పాలన దోపిడీకి దారితీసింది. వాణిజ్య పంటలను బలవంతంగా పండించి ఎగుమతి విధానాలతో కరువులు తీవ్రమయ్యాయి. బ్రిటిష్ పార్లమెంట్ 1874లో అధికారాన్ని క్రౌన్‌కు బదిలీ అయ్యాక పూర్తిగా రద్దు అయింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రెండోసారి మూతపడింది.