PF ATM UPI Withdrawal : EPFO బంపర్ న్యూస్.. ఈ నెల నుంచే PF డబ్బులు చేతికి.. ATM, UPI ద్వారా డైరెక్ట్ విత్‌డ్రా!
PF ATM UPI Withdrawal : ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్‌డ్రాయల్స్‌పై ఈపీఎఫ్ఓ ఇంకా పరిమితిని విధించలేదు. ప్రారంభంలో పీఎఫ్ ఖాతాలో మొత్తం సొమ్ములో సుమారు 50శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- May 9, 2026 / 06:22 PM IST
PF ATM UPI Withdrawal
- జీతగాళ్లకు బిగ్ రిలీఫ్.. పీఎఫ్ ఫండ్స్ కోసం నో టెన్షన్
- ఇక ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు
- ఏటీఎం మెషీన్ వద్దకు వెళ్లి మీ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు
PF ATM UPI Withdrawal : దేశవ్యాప్తంగా సుమారు 7.8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ (మే) నెలలో భారీ ఊరట లభించనుంది. పీఎఫ్ ఫండ్స్ పొందేందుకు ఇకపై ప్రభుత్వ ఆఫీసులకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.
2026 మే నెలాఖరు నాటికి ఏటీఎంలు, యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ ఫండ్స్ విత్ డ్రా చేసుకునేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)రెడీ అవుతోంది.
ఇందులో భాగంగానే సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు ‘EPFO 3.0’ కార్యక్రమాన్ని ఈపీఎఫ్ఓ ప్రారంభిస్తోంది. ఈ ప్రక్రియ 2026 మధ్య నాటికి పూర్తి అవుతుందని, దాంతో పీఎఫ్ సంబంధిత ప్రాసెస్ మొత్తం దాదాపు 100శాతం ఆన్‌లైన్‌గా మారతాయని అంచనా. ఈపీఎఫ్ఓ నిర్ణయంతో ఉద్యోగులకు వారి ఫండ్స్ పై పూర్తి నియంత్రణను అందిస్తుంది.
ఈపీఎఫ్ఓ సభ్యులకు స్పెషల్ ఏటీఎం కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. పీఎఫ్ ఖాతాలకు నేరుగా లింక్ అయి ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మీ సమీపంలోని ఏదైనా ఏటీఎం మెషీన్ వద్దకు వెళ్లి మీ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవచ్చు.
Read Also : Amazon Summer Sale : అమెజాన్‌లో ఒప్పో ఫోన్లపై బంపర్ ఆఫర్లు.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. ఏ ఫోన్ కొంటారంటే?
అంతేకాదు.. యూపీఐకి కూడా లింక్ అయి ఉంటుంది. తద్వారా మీ మొబైల్ నుంచే నేరుగా పేమెంట్లు చేయవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఏటీఎం, యూపీఐ నుంచి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు? :
ఈపీఎఫ్ఓ, ఏటీఎంలు లేదా యూపీఐ ద్వారా డబ్బు విత్‌డ్రా చేసేందుకు లిమిట్స్ ఉన్నాయి. ప్రారంభంలో పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో సుమారు 50శాతం మాత్రమే అనుమతి ఉంది.
ఈ షరతులు తప్పనిసరి :
యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ ఫండ్స్ విత్‌డ్రాకు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది.
కేవైసీ అప్‌డేట్ : మీ (UAN) నంబర్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉండాలి.
డాక్యుమెంట్ల లింకింగ్ : మీ ఆధార్, పాన్ బ్యాంకు ఖాతా నంబరు మీ పీఎఫ్ పోర్ట్‌ఫోలియోతో సరిగ్గా లింక్ అయి ఉండాలి.
బ్యాంకు పాస్‌బుక్ : ఏటీఎం సౌకర్యం కోసం మీ బ్యాంకు పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయాలి. ఈపీఎఫ్‌ఓ (EPFO) రికార్డులతో సరిపోలడం ముఖ్యం
పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా సరైనదేనా? :
పీఎఫ్ డబ్బులు విత్‌డ్రాపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగుల పింఛను పథకం (EPS) ప్రావిడెంట్ ఫండ్ మీ పదవీ విరమణకు చాలా కీలకం. పీఎఫ్ ఫండ్స్ సంపాదించిన చక్రవడ్డీ కాలక్రమేణా భారీగా పెరుగుతాయి. అందుకే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయొద్దని సూచిస్తున్నారు.
వాస్తవానికి, ఏటీఎంలు, యూపీఐతో ఈజీగా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. అలా అని చిన్న మొత్తాలను విత్‌డ్రా చేస్తూ పోతే వృద్ధాప్యంలో చేతికి పూర్తి మొత్తంలో డబ్బులు సరిపోవు. పీఎఫ్ డబ్బులను అత్యవసరమైతే తప్ప తీసుకోకపోవడమే బెటర్.
